Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
సమ్మర్ స్పెషల్ డ్రింక్..రుచితో పాటు ఆరోగ్యం కూడా..మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి
సమ్మర్ లో ఎండల దెబ్బకి చల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. వేసవికాలంలొ సాధారణంగా రోడ్డుమీద వెళ్తూ ఏదైనా షాపు దగ్గర ఆగినప్పుడో లేదా ఏదైనా స్టోర్ కి వెళ్లినప్పుడు అక్కడ ఫ్రిడ్జ్ లలో కనిపించే ఫ్యాకెట్ మ్యంగో ఫ్రూటీ తాగుతుంటారు చాలామంది. చిన్నపిల్లలు అయితే ఎక్కువగా వీటిని ఇష్టపడుతుంటారు. అయితే ఫ్యాకేజ్డ్ ఫ్యూటీ కన్నా ఇంట్లోనే దానిని మించిన టేస్ట్ తో నేచురల్ మ్యాంగో ఫ్రూటీని నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఇంట్లోనే టేస్టీ మ్యాంగో ఫ్రూటీని తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
హోంమేడ్ మ్యాంగో ఫ్రూటీ తయారీకి కావలసిన పదార్థాలు
-పండిన మామిడికాయ
-తోతాపురి మామిడికాయ
-చక్కెర
-నీళ్లు
-మ్యాంగో ఎసెన్స్

మ్యాంగో ఫ్రూటీ తయారీ విధానం
-ముందుగా రెండు పండిన మామిడిపండ్లను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఓ బౌల్ లో వేసి పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు ఉప్పు కారం అద్దుకొని తినే తోతాపురి మామడికాయను ఒకదాన్ని తీసుకొని దాని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు ఓ కుక్కర్ లో మొత్తం మామిడికాయల ముక్కలు, 1 కప్పు చక్కెర, 1 లీటర్ నీళ్లు పోసి మూతపెట్టండి.
-కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి మీడియం మంటమీద 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి.
-స్టీమ్ పోయిన తర్వాత ఉడికిన మామిడిముక్కలను మెత్తగా గ్రైండ్ చేయాలి.
-తర్వాత జల్లెడలో దీనిని పోసి వడగట్టి తీసుకోవాలి. పిప్పిని పడేయాలి. ఇప్పుడు ఓసారి తీపి చెక్ చేసుకొని కావాలనుకుంటే పొడి చేసిన పంచదారను వేసి బాగా కలపండి.
-తర్వాత అందులో 5 బొట్లు మ్యాంగో ఎసెన్స్ ఇందులో వేసి కలపాలి.
-తర్వాత అందులో అరలీటరు దాకా నీళ్లు పోసి చిక్కదనాన్ని అడ్జెస్ట్ చేసుకోండి. అంతే మ్యాంగో ఫ్రూటీ రెడీ. దీనిని కనీసం నాలుగు గంటలు చల్లార్చి తర్వాత తాగితే అద్భుతంగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
మ్యాంగో ఫ్రూటీ వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది,డీహైడ్రేషన్ నుంచి
రక్షిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది..ఇది జీర్ణక్రియను
మెరుగుపర్చడంలో,ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతంది. ఇందులో
నేచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ ఏ చర్మ ఆరోగ్యాన్ని,కంటి ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తుంది. ఇందులోని పొటాషియం రక్తపోటుని
నియంత్రిస్తుంది,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మ్యాంగో
ఫ్రూటీని మితంగా తాగడం మంచిది. ఇందులో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది
కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నోళ్లు దీనిని తాగే ముందు డాక్టర్ సలహా
తీసుకోవడం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications