Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
ఎండాకాలం వచ్చేసింది. ఎండల తీవ్రత పెరిగేకొద్దీ మన శరీరం త్వరగా అలిసిపోతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, తక్షణ శక్తినిచ్చే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బార్లీ. సమ్మర్ మొదలైందంటే చాలు, బార్లీ జావ లేదా బార్లీ నీళ్లు తాగడం మనకు అలవాటే. బార్లీలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయిత, రోజూ బార్లీ జావ తాగితే బోర్ కొడుతుంది. అందుకే, కేవలం జావ మాత్రమే కాకుండా నోరూరించే రుచికరమైన బార్లీ లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు సూపర్ టేస్టీగా ఉండటమే కాకుండా, శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. పాకం పట్టే కష్టమేమీ లేకుండా, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో అప్పటికప్పుడు చాలా సులువుగా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బార్లీ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
బార్లీ గింజలు - 1 కప్పు
పల్లీలు (వేరుశనగ గుళ్లు) - 1 కప్పు
అవిసె గింజలు - పావు కప్పు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
బాదం పప్పులు - 20
జీడిపప్పులు - గుప్పెడు
యాలకులు - 4
నెయ్యి - లడ్డూలు చుట్టడానికి సరిపడా
బార్లీ లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి పాన్ పెట్టుకోవాలి. అందులో బార్లీ గింజలు వేసి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ వేయించాలి. బార్లీ గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అదే పాన్ లో పల్లీలు వేసి సన్నని మంటపై దోరగా ఫ్రై చేసుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అవిసె గింజలను కూడా పాన్ లో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ మూడింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన బార్లీ గింజలు, యాలకులు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే వేయించిన పల్లీలు, అవిసె గింజలు వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు ఈ పొడిలో బెల్లం తురుము వేసి చేత్తో బాగా కలపాలి. బెల్లం పొడిలో పూర్తిగా కలిసిపోయేందుకు, ఈ మిశ్రమాన్ని మళ్లీ కొద్దికొద్దిగా మిక్సీ జార్ లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగగానే, ఆ నేతితో సహా డ్రై ఫ్రూట్స్‌ను బార్లీ-బెల్లం మిశ్రమంలో వేసి కలపాలి.
-అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నెయ్యి కలుపుతూ మీకు కావాల్సిన సైజులో గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ లడ్డూలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications