Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే!
ఎండాకాలం వచ్చేసిందంటే చాలు.. మిద్దెల మీద, బాల్కనీల్లో తడి బట్టలపై వడియాలు, అప్పడాలు పెట్టే సందడి మొదలవుతుంది. అమ్మ చేతి వడియాలు ఎండబెట్టడం, వాటిని డబ్బాల్లో భద్రపరుచుకుని సంవత్సరం పాటు వేయించుకుని తినడం మనందరికీ ఇష్టమైన పనే. సాధారణంగా బియ్యప్పిండి, మినప్పప్పు లేదా బొంబాయి రవ్వతో వడియాలు పెడుతుంటారు. కానీ,ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఈ సారి కాస్త వెరైటీగా టమాటా వడియాలు ట్రై చేయండి.

చూసేందుకు కలర్ ఫుల్ గా ఉండటమే కాకుండా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా భలే రుచిగా ఉంటాయి టమాటా వడియాలు. అన్నంలోకి నంజుకోవడానికే కాదు, సాయంత్రం వేళ స్నాక్స్ లా తినడానికి కూడా ఇవి పర్ఫెక్ట్. పైగా వీటిని తయారు చేయడం చాలా సులువు. టేస్టీ అండ్ క్రంచీ టమాటా వడియాలను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
టమాటా వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
పండిన టమాటాలు - అర కేజీ
సగ్గుబియ్యం - 1 కప్పు
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - 1 టీస్పూన్
కొత్తిమీర తరుగు - గుప్పెడు

టమాటా వడియాలు తయారీ విధానం
-ముందుగా ఎర్రటి టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో సగ్గుబియ్యం వేసి, మరీ మెత్తని పౌడర్ లా కాకుండా కాస్త బరకగా అంటే రవ్వలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-అదే మిక్సీ జార్ లో ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. మీరు ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఆరు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. అంటే 1 కప్పు సగ్గుబియ్యంకి 6 కప్పుల నీళ్లు పోయాలి.
-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంటను సిమ్‌లో పెట్టి, గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించాలి.
-సగ్గుబియ్యం కాస్త ఉడికాక.. అందులో టమాటా ప్యూరీ, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కాస్త చిక్కబడి, దగ్గర పడేంత వరకు సుమారు 10 నిమిషాల పాటు కలుపుతూనే ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-స్టవ్ ఆఫ్ చేశాక అందులో జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఎండ బాగా తగిలే బాల్కనీలో లేదా మేడ మీద ఒక చాప వేసి, దానిపై శుభ్రంగా ఉతికి, నీళ్లు లేకుండా పిండిన తడి కాటన్ వస్త్రాన్ని పరుచుకోవాలి.
-సిద్ధం చేసుకున్న టమాటా మిశ్రమాన్ని చిన్న గరిటెతో తీసుకుంటూ, వస్త్రంపై అప్పడాల సైజులో వడియాల్లా పోసుకోవాలి. మరీ పలుచగా పోయకూడదు.
-ఎండ తీవ్రతను బట్టి వీటిని ఒకటి లేదా రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి.
-వడియాలు బాగా ఎండిన తర్వాత, వస్త్రం నుంచి తీసి ప్లేట్ లోకి మార్చుకుని మరో రోజు ఎండలో ఉంచాలి. అంటే టమాటా వడియాలు రెడీ. పూర్తిగా ఎండిన ఈ కలర్ ఫుల్ టమాటా వడియాలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
