Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రొటీన్ దోసెలు తిని బోర్ కొట్టిందా? క్రిస్పీ చికెన్ దోసె ట్రై చేయండి..రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే చేసుకోండిలా!
సాధారణంగా మనం బంగాళాదుంపతో చేసే మసాలా దోసె లేదా ఉల్లిపాయ దోసె లేదా నెయ్యి దోసె, పెసర దోసె, సెట్ దోసె వంటివి తిని ఉంటాం. కానీ ఎప్పుడూ రొటీన్ గా అవే దోసెలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సండే చికెన్ దోసె ట్రై చేయండి.
ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి డిన్నర్ కి చికెన్ దోసెను తయారు చేసి చూడండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్ రుచితో, ఇంట్లోనే చికెన్ దోసెను సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ (చిన్న ముక్కలు లేదా కీమా) - 400
గ్రాములు
ఉల్లిపాయలు - 2
కారం - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
దోసె పిండి - అవసరమైనంత
కరివేపాకు - కొద్దిగా
టమాటా గుజ్జు - అర కప్పు
పసుపు - అర టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - ముప్పావు కప్పు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.
-నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంటపై వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారిన తర్వాత అందులో టమాటా ప్యూరీ, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం నుండి నూనె పైకి తేలే వరకు కనీసం 3- 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
-ఇప్పుడు కుక్కర్ లో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి,ముప్పావు కప్పు నీరు పోసి ఒకసారి కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికేలా చూసుకోండి. చికెన్ ఉడికిన తర్వాత అందులో నీరు ఏమైనా ఉంటే అది పూర్తిగా ఆవిరైపోయి మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ లేదా ఇనుప దోసెల పెనం పెట్టి బాగా వేడి చేశాక గరిటెతో దోసె పిండిని తీసుకుని పల్చగా, గుండ్రంగా పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి. అంచుల వెంబడి కొద్దిగా నూనె వేసి దోసెను ఎర్రగా కాలనివ్వాలి.
-దోసె క్రిస్పీగా మారుతున్న సమయంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలాను 2-3 టేబుల్ స్పూన్లు తీసుకుని దోసె మధ్యలో ఉంచి సమానంగా స్ప్రెడ్ చేయండి. దోసెను అందంగా మడిచి ప్లేట్ లోకి తీసుకోండి.
-అంతే చికెన్ దోసె రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications