Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
దేనిలోకైనా అదిరిపోయే బెంగాలీ స్టైల్ చికెన్ కుర్మా..ప్లేట్ లో ముద్ద మిగలదు, గిన్నెలో ముక్క మిగలదు!
ఆదివారం వచ్చిందంటే మన తెలుగువాళ్ల ఇళ్లల్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ముక్క లేనిదే చాలామంది ఆదివారం ముద్ద దిగదు, కొంతమందికి అయితే రోజూ ముక్క ఉండాల్సిందే. ఏదో రూల్ మాదిరిగా ప్రతి సండే చికెన్ ఇంటికి తెచ్చుకోవడం, ఎప్పుడు చేసుకునేలాగే ఇగురు లేదా పులుసు చేసుకోవడం మనకు అలవాటు.
అయితే ప్రతిసారీ ఒకే రకమైన చికెన్ కర్రీ తిని తిని బోర్ కొడుతుంటే ఓసారి బెంగాలీ చికెన్ కుర్మా ట్రై చేసి చూడండి. బెంగాలీ వంటకాల్లో బంగాళాదుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. చికెన్, బంగాళాదుంపల కాంబినేషన్ తో చేసే ఈ చికెన్ కుర్మా..వేడి వేడి అన్నం, బగారా రైస్, బిర్యానీలోకే కాకుండా.. దోశ, చపాతీ, పూరీ వంటి టిఫిన్లలోకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. రుచికరమైన బెంగాలీ స్టైల్ చికెన్ కుర్మాను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
చికెన్: 500 గ్రాములు
బంగాళాదుంపలు: 3
ఉల్లిపాయలు: 3
టమోటాలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి: 5
బిర్యానీ ఆకు-1
ఎండుమిర్చి-1
మిరియాలు-అర టీస్పూన్
యాలకులు-4
లవంగాలు-4
దాల్చిన చెక్క-3 చిన్న ముక్కలు
కశ్మీరీ కారం-1 టీస్పూన్
పసుపు-అర టీస్పూన్
ధనియాల పొడి-1 టేబుల్ స్పూన్
గరం మసాలా-పావు టీస్పూన్
పంచదార: అర టీస్పూన్
కొత్తిమీర: గార్నిష్ కోసం
నూనె, ఉప్పు: తగినంత
వేడి నీళ్లు: ఒకటిన్నర కప్పులు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 4-5 స్పూన్ల నూనె వేడి చేయాలి.
-నూనె కాగాక అందులో కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి మీడియం మంటపై బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-పాన్ లోని అదే నూనెలో బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి వేయించాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి.
-ఇప్పుడు పాన్ లో ధనియాల పొడి, కశ్మీరీ కారం, పసుపు వేసి కలపాలి. వెంటనే టమోటా ముక్కలను వేసి బాగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.
-తర్వాత శుభ్రం చేసిన చికెన్, వేయించి పెట్టుకున్న బంగాళాదుంపలు, పచ్చిమిర్చి పాన్ లో వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంటపై సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-ఇప్పుడు గ్రేవీ కోసం పాన్ లో ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి చికెన్, బంగాళాదుంపలు పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి.ః
-చివరగా పంచదార (ఇది బెంగాలీ వంటకం స్పెషాలిటీ, తీపి రాదు కానీ రుచిని పెంచుతుంది),గరం మసాలా పొడి చల్లి మరో 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
-అంతే ఘుమఘుమలాడే బెంగాలీ స్టైల్ చికెన్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






