Latest Updates
-
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది!
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!
పులావ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ చిట్టిముత్యాలతో కోడి పులావ్ చేస్తే ఇక ఆగుతారా..కంచెం క్షణాల్లోనే ఖాళీ చేసేయరు. అయితే చిట్టిముత్యాల కోడి పులావ్ తయారీ పెద్ద కష్టమైన పనే కాదు. చాలా ఈజీగానే దీనిని తయారుచేసుకోవచ్చు. వేడి వేడిగా దీన్ని తింటుంటే ఆ రుచిని జన్మలో మర్చిపోరు.
అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేనే అనేక రకాల పోషకాలు, ప్రొటీన్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ వీకెండ్ లో ఇంటికి చికెన్ తెచ్చుకుంటే స్పైసీగా, జ్యూసీగా తిరుగులేని టేస్ట్ తో చిట్టిముత్యాల కోడి పులావ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చిట్టిముత్యాల కోడి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ మ్యారినేషన్ కోసం:
చికెన్-1 కేజీ
ఉప్పు- 1 టీస్పూన్
పసుపు- అర టీస్పూన్
కారం పొడి- 1 టీస్పూన్
బిర్యానీ మసాలా పొడి- 1 టీస్పూన్
ధనియాల పొడి- 1 టీస్పూన్
ఆయిల్- 1 టీస్పూన్
బియ్యం మిక్స్ కోసం:
చిట్టిముత్యాల బియ్యం- 1 కేజీ
ఉప్పు- 1 టీస్పూన్
కారం పొడి- 3 టీస్పూన్లు
బిర్యానీ మసాలా పొడి- 2 టీస్పూన్లు
ధనియాల పొడి- 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒకటిన్నర టీస్పూన్
నెయ్యి- 1 టీస్పూన్
4 గ్లాసుల బియ్యానికr 9-10 గ్లాసుల నీళ్లు
పులావ్ కోసం:
ఉల్లిపాయ- 1
జీడిపప్పు- 15
వెల్లుల్లి రెబ్బలు- 10
అల్లం- కొంచెం
సాంబార్ ఉల్లిపాయలు 15-20
పచ్చిమిర్చి 5
ఎండుమిర్చి 6
యాలకలు 2
లవంగాలు 3
జీలకర్ర 1 టీస్పూన్
బిర్యానీ ఆకులు 3
మరాఠీ మొగంగ 1
జీడిపప్పు 15
నూనె 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి 2 టేబుల్ స్పూన్లు
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు
చిట్టిముత్యాల కోడి పులావ్ తయారీ విధానం
-ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా నూనె వేసి మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలా చేత్తో కలుపుకోండి. తర్వాత దీనిపై మూతపెట్టి కనీసం 1 గంట సేపు పక్కన పెట్టుకోండి.
-1 గంట తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 1 గంట సేపు పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలను వేయండి. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి కలిపి మూతపెట్టి చికెన్ ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-ఇప్పుడు చిట్టిముత్యాల బియ్యం 1 సారి శుభ్రంగా కడిగి నీళ్తు వంపేయండి. ఇప్పుడు ఆ బియ్యంలోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి వేసి మొత్తం బియ్యానికి బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోండి. ముందే మసాలా కలపడం వల్ల ప్రతి మెతుకు రుచి అద్భుతంగా ఉంటుంది.
-తర్వాత స్టవ్ మీద వెడల్పాటి లోతుగా ఉండే గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో చెక్క, జీలకర్ర, యాలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేగనిచ్చి తర్వా సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలలికలు, ఎండుమిర్చి, కరివేపాకు,జీడిపప్పు వేసి మంచి సుేవాసన వచ్చేదాకా వేయించాలి. తర్వా అందులో మసాలా కలిపిపెట్టుకున్న బియ్యం వేసి మెతుకులు కొద్దిగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించాలి.
-తర్వాత అందులో సరిపడా వేడి నీళ్లు పోసి కలిపి అందులోనే ఉడికించుకున్న చికెన్ ముక్కలన్నీ వేసి బాగా కలపండి. 1 పొంగు వచ్చిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి ఉడికించుకోవాలి.
-చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే ఘుమఘుమలడే చిట్టిముత్యాల కోడి పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
