Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది..సూపర్ టేస్టీ మటన్ మసాలా కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
సండే వచ్చిందంటే చాలు చాలా ఇళ్లల్లో నాన్ వెజ్ వంటకాలు గుబాళిస్తుంటాయి. అందులోనూ మటన్ అంటే మాంసాహార ప్రియులకు అమితమైన ఇష్టం. అయితే, మటన్ వండటం కొంచెం కష్టమని, సమయం ఎక్కువ తీసుకుంటుందని చాలామంది చికెన్ వైపే మొగ్గుచూపుతుంటారు. కానీ మటన్ మసాలా కర్రీ చేస్తే తక్కువ సమయంలో రెడీ అవడమే కాకుండా, ఆహా అనుకుంటూ తినాల్సిందే.
ఈ మటన్ మసాలా కర్రీ కేవలం చపాతీలు, పూరీలకే కాదు.. వేడి వేడి అన్నం, బగారా రైస్ లేదా బిర్యానీలోకి కూడా అదిరిపోయే కాంబినేషన్. మటన్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె: 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి రెబ్బలు: 8-10
అల్లం: 1 అంగుళం ముక్క
ఎండు కొబ్బరి లేదా గసగసాలు: 1 టీస్పూన్
మిరియాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 3/4 టీస్పూన్
సోంపు: 1 టీస్పూన్
ధనియాలు లేదా ధనియాల పొడి: 1 టీస్పూన్
దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క
లవంగాలు: 5
ఏలకులు: 1
కరివేపాకు: గుప్పెడు
మటన్: అర కిలో
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1
టమోటాలు: 2
పసుపు: పావు టీస్పూన్
కారం: 1 టీస్పూన్
కాశ్మీరీ కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: ఒకటిన్నర టీస్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక తరిగిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, మిరియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు మెత్తబడి, మసాలా దినుసుల నుండి మంచి వాసన వచ్చే వరకు 3-4 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు ఇందులో పసుపు, కారం, కాశ్మీరీ కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు మటన్ ముక్కలను వేయాలి.
-మంటను మీడియంలో పెట్టి మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించాలి.
-ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీరు పోసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. నూనె పైకి తేలి, ఘుమఘుమలాడే మటన్ కర్రీ రెడీ. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications