Latest Updates
-
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
ప్రస్తుతం అనేక రకాల జబ్బులు మనుషుల్ని పట్టి పీడించడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. అందుకే గత కొంతకాలంగా, ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి చాలా మంది తమ ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ వస్తున్నారు. క్రమంగా మన పూర్వీకులు తిన్న ఫుడ్ వైపు మళ్లుతున్నారు.
మన తాత ముత్తాతలు తిని వందేళ్లు ఆరోగ్యంగా బతికిన జొన్న జావ లాంటి అద్భుతమైన ఆహారాన్ని తిరిగి అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం. కేవలం ఖర్చు తక్కువే కాకుండా, తయారీ కూడా ఎంతో సులభం. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా లేదా డిన్నర్ గా కూడా దీనిని తీసుకోవచ్చు. బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది బెస్ట్. జొన్న జావ మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

జొన్న జావ తయారీకి కావాల్పిన పదార్థాలు
-జొన్న రవ్వ
-పచ్చి శెనగపప్పు
-క్యారెట్
-పచ్చి బఠాణీలు
-ఉప్పు
-కొత్తిమీర
-మిరియాల పొడి
-ఉల్లిపాయలు
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
జొన్న జావ తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో ముప్పావు కప్పు జొన్న రవ్వ, పావు కప్పు పచ్చి శెనగపప్పు వేసి ఇందులో నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడిగాక 3 కప్పుల నీళ్లు ఇందులో పోసి,చిటికెడుఉప్పు వేసి మూతపెట్టి 1 గంట పాటు నాననివ్వాలి.
-1 గంట తర్వాత కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికిన జొన్న మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి పలచగా ఉండేలా కలుపుకుని స్టవ్ మీద నుంచి దించేయాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టీస్పూన్ వెన్న లేదా ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో 1 టీస్పూన్ వెల్లుల్లి తరుగు వేసి వేయించాక ఇందులోనే 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి అవి కొంచెం ట్రాన్సపరెంట్ గా మారితే చాలు. అప్పుడు అందులో పావు కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు పచ్చి బఠాణీలు(మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు)వేసి,ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి.
-క్యారెట్,బఠాణీలు మగ్గిన తర్వాత అందులో 1 టీస్పూన్ మిరియాల పొడి, సన్నగా తరగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులో రెడీ అయిన జొన్న మిశ్రమం వేసి కలుపుకోవాలి. మూతపెట్టి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న జావ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
