Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే కాకరకాయ భర్తా.. ఇలా సింపుల్ గా చేయండి
కాకరకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లిస్తారు. కానీ నార్త్ ఇండియా స్టైల్ లో చేసే ప్రత్యేకమైన వంటకాన్ని రుచి చూస్తే మాత్రం.. కాకరకాయను ఇష్టపడని వారు కూడా మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు. అదే కాకరకాయ భర్తా. చేదు ఏమాత్రం లేకుండా, అద్భుతమైన మసాలా రుచితో అదిరిపోతుంది.
కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో విటమిన్ సి, డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక దివ్యౌషధం లాంటిది. నార్త్ ఇండియా ఫేమస్ కాకరకాయ భర్తా మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కాకరకాయలు - 5
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి, పైన ఉన్న గరుకు తొక్కను చెక్కేయండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలకు తగినంత ఉప్పు పట్టించి సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు నీరు బయటకు వచ్చేస్తుంది.
-తర్వాత ముక్కలను చేత్తో గట్టిగా పిండితే చేదు నీరంతా పోయి, ముక్కలు పొడిగా మారతాయి.
-స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో ఈ కాకరకాయ ముక్కలను వేసి, మీడియం మంటపై బంగారు గోధుమ రంగులోకి వచ్చి మెత్తబడే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-అదే పాన్ లో మిగిలిన నూనె వేసి వేడిచేసి ముందుగా అల్లంవెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు టమోటా ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలాలో నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-మసాలా బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసి కలపాలి. భర్తా (గుజ్జు) టెక్స్చర్ రావడం కోసం.. గరిటెతో లేదా పప్పుగుత్తితో ముక్కలను కొద్దిగా మెదుపుకోవాలి.
-చివరగా గరం మసాలా చల్లి మరో రెండు మూడు నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గనివ్వాలి. అంతే గుమగుమలాడే, ఎంతో పోషకమైన కాకరకాయ భర్తా రెడీ. దీనిపై సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేడి వేడి అన్నం, చపాతీ, లేదా జొన్న రొట్టెలతో వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications