Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
రక్తం పట్టాలా? ఎముకలు బలపడాలా? అయితే ఈ లడ్డు తినాల్సిందే!
ఈ రోజుల్లో చాలామంది పిల్లలు జంక్ ఫుడ్ కి అలవాటు పడి, రక్తహీనత, బలహీనమైన ఎముకల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారికి ఇంట్లోనే, మీ చేతులతోనే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్నాక్ సజ్జు లడ్డు చేసి ఇవ్వండి.
రోజూ ఒక్క సజ్జ లడ్డు తింటే చాలు, మీ పిల్లలలో రక్తహీనత మాయమవుతుంది, ఎముకలు బలంగా తయారవుతాయి. స్కూల్ నుండి వచ్చిన పిల్లలకు లేదా సాయంత్రం ఆకలిగా ఉన్నప్పుడు ఇవ్వడానికి ఇది బెస్ట్ స్నాక్. ఇంట్లోనే ఈ లడ్డు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

సజ్జ లడ్డుకి కావలసిన పదార్థాలు
సజ్జ పిండి:250 గ్రాములు
బెల్లం:400 గ్రాములు
నెయ్యి: 10-12 టీస్పూన్లు
తెల్ల నువ్వులు: 100 గ్రాములు
వేరుశనగలు (పల్లీలు): 150 గ్రాములు
బాదం: 75 గ్రాములు
ఎండుద్రాక్ష (కిస్మిస్): 25 గ్రాములు
ఏలకుల పొడి: 1 టీస్పూన్
శొంఠి పొడి: పావు టీస్పూన్
ఉప్పు: 2 చిటికెడు
నీరు: అర కప్పు
సజ్జ లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి బాండీని పెట్టుకోండి. అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక, తెల్ల నువ్వులు వేసి బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించండి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.
-అదే బాండీలో మరో టీస్పూన్ నెయ్యి వేసి, వేయించిన వేరుశనగ పప్పులను (పొట్టు తీసినవి) వేసి కాసేపు వేయించండి. వీటిని కూడా నువ్వుల ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో 1 టీస్పూన్ నెయ్యి వేసి, తరిగిన బాదం ముక్కలను వేయించండి. అవి వేగాక ఎండుద్రాక్ష వేసి, అవి ఉబ్బే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-మళ్లీ అదే బాండీలో 2 టీస్పూన్ల నెయ్యి వేసి, సజ్జ పిండి వేయండి. సన్నని మంటపై పిండిని వేయిస్తూ, మధ్యమధ్యలో కొద్దికొద్దిగా (మొత్తం 8 టీస్పూన్ల వరకు) నెయ్యి కలుపుతూ ఉండాలి. పిండి నుండి పచ్చి వాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించి, పక్కన పెట్టి చల్లార్చండి.
-వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, బాదంలో సగం తీసుకుని మిక్సీ జార్ లో వేసి ఒక్కసారి బరకగా తిప్పండి. మరీ మెత్తగా పొడి చేయకూడదు.
-ఒక పెద్ద గిన్నెలో వేయించిన సజ్జ పిండి, మిక్సీ పట్టిన పప్పుల పొడి, మిగిలిన వేయించిన పప్పులు, ఏలకుల పొడి, శొంఠి పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.
-ఒక గిన్నెలో తురిమిన బెల్లం, అర కప్పు నీళ్లు పోసి కరిగించండి. బెల్లం కరిగాక వడకట్టి, మళ్ళీ స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు మరిగించండి.
-తీగ పాకం రాగానే స్టవ్ ఆపేసి వెంటనే ఆ పాకాన్ని పిండి మిశ్రమంలో పోయండి. గరిటెతో వేగంగా, బాగా కలపండి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మీకు నచ్చిన సైజులో గుండ్రని లడ్డూలుగా చుట్టండి.
-అంతే సజ్జ లడ్డు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే 10-15 రోజుల వరకు ప్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications