Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Moringa Rice: పోషకాల ఘని..వందల రోగాలను ఫసక్ చేసే మునగాకు అన్నం..ఎలా చేసుకోవాలంటే
మునగ చెట్టు మన ఆరోగ్యానికి మేలు చేసే సంజీవని అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మునగ ఆకుల దగ్గర నుంచి దాని కాయలు, దాని బెరడు సహా అన్నీ మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేసేవే. మునగ ఆకులకి 300కి పైగా రోగాలను నయం చేసే శక్తి ఉందని చెబుతున్నారు. దీని పవర్ అంతా ఇంతా కాదు. అలాంటి మునగాకు ఉపయోగించి మంచి టేస్టీ రైస్ తయారుచేసుకుంటే ఇక మన శరీరాన్ని ఏ వ్యాధులు ఏం చేయలేవ్. మునగాకు అన్నంని తయారుచేయడం కూడా నిమిషాల్లో పని. దీన్ని మునగాకు అన్నం అనే కంటే పోషకాల రైస్ అని చెప్పవచ్చు. బ్యాచిలర్స్ కూడా సింపుల్ గా చేసుకోగలిగే వంటకం ఇది. మునగాకు అన్నంని మీ ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
మునగాకు అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-ధనియాలు
-జీలకర్ర
-జీడిపప్పు
-మునగాకు
-ఆవాలు
-పచ్చి శెనగపప్పు
-ఆయిల్
-నువ్వులు
-వెల్లుల్లి
-మిరియాల పొడి

మునగాకు అన్నం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఆయిల్ లేకుండానే వేయించాలి.
-నువ్వులు చిట్లిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి నీడన ఆరబెట్టిన 50 గ్రాముల మునగాకులు వేసి చెమ్మ ఆరిపోయేంతవరకు వేయించాలి. మంటను మీడియంలో ఉంచాలి.
-మునగాకు కొంచెం పొడిపొడిగా అయిన తర్వాత అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
-బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాండీలోని మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె లేదా శెనగ నూనె వేసి వేడి చేసి అందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిట్లనిచ్చాక 1 టీస్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు,4 దంచిన వెల్లుల్లి, 15 జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేసుకోవాలి.
-ఇప్పుడు తాళింపులో ఒకటిన్నర కప్పు పొడి పొడిగా వండిన అన్నం వేయండి. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న మునగాకు పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలపండి. పెద్ద మంట మీద ఒక నిమిషం అటు ఇటూ కలబెడుతూ ఉండండి.
-చివరిగా అందులో మిరియాల పొడి వేసి బాగా కలిసేలా కలపండి. అంతే టేస్టీ మునగాకు అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
