Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
స్పైసీ మసాలా ఎగ్ బిర్యానీ..అబ్బబ్బా ఏం టేస్ట్ సామీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
మసాలా ఎగ్ బిర్యానీ అనేది ఒక రుచికరమైన మరియు సులభంగా తయారుచేసుకోగలిగే వంటకం. ఇది చికెన్ లేదా మటన్ బిర్యానీకి ఒక మంచి ప్రత్యామ్నాయం. ఈ వంటకాన్ని వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో దీనిని నెయ్యితో, మరికొన్ని చోట్ల నూనెతో చేస్తారు. ఈ వంటకం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ వంటకాలలో భాగం. గుడ్డులోని ప్రోటీన్, బిర్యానీలోని సుగంధ ద్రవ్యాలు దీనిని ఒక సంపూర్ణ భోజనంగా చేస్తాయి. ఇది కేవలం రుచిలో మాత్రమే కాకుండా, పోషక విలువల్లోనూ గొప్పది. మసాలా ఎగ్ బిర్యానీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బాస్మతి బియ్యం
-కోడిగుడ్లు
-నూనె
-నెయ్యి
-జీలకర్ర పొడి
-కారం
-పసుపు
-ఉప్పు
-ఉల్లిపాయ
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-జాపత్రి
-యాలకలు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-షాజీరా
-బిర్యానీ ఆకు
-ధనియాల పొడి
-గరం మసాలా
-జీలకర్ర
-పెరుగు
-పుదీనా తరుగు
-కొత్తిమీర తరుగు
-నిమ్మరసం

తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో ఒకటిన్నర కప్పుల బాస్మతి బియ్యం పోసి కడిగి నీళ్లు
పోసి కనీసం 1 గంటసేపు నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి.
-కాగిన నూనెలో 1కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి.ఈ వేయించిన ఉల్లిపాయలను చివర్లో బిర్యానీ మీద చల్లుకుంటాం.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ లో మిగిలిన నూనెలో 4 ఉడికించిన గుడ్డకు గాట్లు పెట్టి వేయండి. ఇందులోనే చిటికెడు కారం, చిటికెడు పసుపు కూడా వేసి గుడ్డును అన్ని వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేగనిచ్చి వాటిని ఓ ఫ్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత కుక్కర్ లో మిగిలిన నూనెలో 1 బిర్యానీ ఆకు, 2 జాపత్రి, రెండున్నర ఇంచుల దాల్చిన చెక్క, 7 లవంగ మొగ్గలు, 5 యాలకలు, అర టీస్సూన్ షాజీరా, అర టీస్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
-తర్వాత అందులోనే సగం ఉల్లిపాయ చీలికలు వేసి తేల బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించాక అందులో రెండు రెమ్మల కరివేపాకు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి.
-తర్వాత అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, 2 టమాటోల సన్నని తరుగు, వేసి టమాటో ముక్క స్కిన్ సపరేట్ అయ్యేదాకా వేగితే సరిపోతుంది.
-టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీస్పూన్ వేయించిన ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీస్పూన్ గరం మసాలా, ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేయాలి. మసాలాలు వేగుతున్నప్పుడే అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోండి..దీంతో మసాలాలు మాడకుండా ఉంటాయి.
-మసాలాలు వేగి అందులోనుంచి ఆయిల్ పైకి తేలినప్పుడు అందులో 1 కప్పు చిలికిన పెరుగు వేసి కలుపుకోవాలి.
-పెరుగు మసాలాలలో కలిసి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పుదీనా,కొత్తిమీర తరుగు, 1 నిమ్మకాయ రసం, రెండు కప్పుల పైన వేడినీళ్లు పోసి పెద్ద మంట మీద ఉడుకు రానివ్వాలి.
-తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించిన కోడిగుడ్లు వేసి నెమ్మదిగా కలిపి కుక్కర్ మూతపెట్టి పెద్ద మంట మీద 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూతతీసి చూస్తే ఘుమఘుమలాడే మసాలా ఎగ్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications