Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చూడటానికి చక్కగా..రుచి రంజుగా..అరోమా అదిరిపోయేలా..పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలంటే
మనలో చాలా మందికి ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్స్ లో ఫ్రైడ్ రైస్ ఒకటి. ముఖ్యంగా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు లేదా ఇంటికి ఏదైనా స్పెషల్ గా ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు మన మెనూలో ఫ్రైడ్ రైస్ తప్పకుండా ఉంటుంది. చికెన్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ప్రాచుర్యం పొందాయో, శాకాహారుల కోసం అంతే రుచికరమైన, పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్. ఇది కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ వంటకం పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంట్లోనే సులభంగా, పరిశుభ్రంగా రెస్టారెంట్ స్టైల్ పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పనీర్-50 గ్రాములు
-అల్లం-అర ఇంచు
-వెల్లుల్లి-3
-ఉప్పు- రుచికి సరిపడా
-ఉల్లిపాయ-1
-పచ్చిమిరపకాయలు-2-3
-వండిన అన్నం-2 కప్పులు
-పసుపు- పావు టీస్పూన్
-కొత్తిమీర-1 కప్పు
-దాల్చిన చెక్క-1 ఇంచు
-బిర్యానీ ఆకు-1
-ధనియాల పొడి-కొంచెం
-పుదీనా ఆకులు- కొన్ని

పనీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
-ముందుగా రోట్లో లేదా మిక్సీలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసి వేడి గరం మసాలా దినుసులు వేసి లైట్ గా వేయించాక అందులోనే 1 ఉల్లిపాయ చిన్న ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
-తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. కొద్దిగా పసుపు కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి.
-తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పనీర్ కూడా వేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి కలుపుకోండి
-తర్వాత అందులో ముందుగా వండిపెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి బాగా కలుపుకోండి.
-దించుముందు ఒక చెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. అంతే అదిరిపోయే పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications