Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మామిడికాయ మునక్కాడ సాంబార్..తరతరాలు గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఎండాకాలం అంటే అందరికీ గుర్తుకొచ్చే ఫ్రూట్ మామిడికాయనే. అయితే ఈ సమ్మర్ లో దొరికే పుల్లటి మాడికాయ, తియ్యటి మునక్కాయల కలయితో సాంబార చేస్తే టేస్ట్ తరతరాలకు గుర్తుండిపోతుంది. ఇది పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన వంటకం కూడా.మామిడికాయలో విటమిన్ C, విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి..మునక్కాయలో ఐరన్, కాల్షియం, విటమిన్ C వంటి పోషకాలు ఉంటాయి.
ఈ రెండింటి కలయిక సాంబార్ ను మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా చేస్తుంది. మామిడికాయ మునక్కాయ సాంబార్ ను మీ ఇంట్లోనే సింపుల్ గా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మామడికాయ మునక్కాడ సాంబార్ తయారీకి కావలసిన
పదార్థాలు
-మునక్కాయలు - 2
-ఉల్లిపాయ - 1
-మామిడికాయ - 1
-నూనె -తగినంత
-ఉప్పు - తగినంత
-కొత్తిమీర - కొద్దిగా
-కంది పప్పు - 1 కప్పు
-టమాటో - 1
-పచ్చిమిర్చి - 2-3
-కరివేపాకు - 2 రెమ్మలు
-ఆవాలు - 1 టీస్పూన్
-మెంతులు - 1/4 టీస్పూన్
-జీలకర్ర - 1/2 టీస్పూన్
-ఎండు మిర్చి - 2
-ఇంగువ - చిటికెడు
-పసుపు - 1/2 టీస్పూన్
-సాంబార్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
వంకాయ పల్లికారం..ఇలా చేశారంటే మీ ఆయన మీ చుట్టూ తిరగాల్సిందే,పిల్లలకు కూడా నచ్చుతుంది
తయారీ విధానం
-ముందుగా కంది పప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుక్కర్లో లేదా గిన్నెలో మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి.
-ఇప్పుడు మామిడికాయను చెక్కు తీసి మీడియం ముక్కలుగా కట్ చేసుకోండి. మునక్కాయలను కూడా శుభ్రంగా కడిగి సుమారు 2 అంగుళాల పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయను చిన్నగా తరుగుకోండి. టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని మధ్యకు చీలికలుగా చేసుకోండి.
-తర్వాత ఒక పెద్ద గిన్నె లేదా పాన్ లో ఆయిల్ వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత మెంతులు, జీలకర్ర వేసి కొద్దిగా వేయించండి. ఎండు మిర్చి,ఇంగువ కూడా వేసి ఒక నిమిషం వేయించండి.
-ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగిన టమాటో ముక్కలు, చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి వేసి టమాటోలు మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. టమాటోలు త్వరగా ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు.
-టమాటోలు మెత్తగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించండి. తర్వాత పసుపు పొడి, సాంబార్ పొడి వేసి బాగా కలపండి. మసాలాలు కూరగాయలకు బాగా పట్టేలా కొద్దిసేపు వేయించండి.
-ఇప్పుడు మెదిపి పెట్టుకున్న కంది పప్పును ఈ మిశ్రమంలో వేసి బాగా కలపండి. అవసరమైనంత నీరు పోసి సాంబార్ చిక్కదనాన్ని సర్దుబాటు చేసుకోండి. మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా చూసుకోండి.
-సాంబార్ కొద్దిగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేయండి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. సాంబార్ ను మీడియం మంట మీద సుమారు 10-15 నిమిషాలు బాగా ఉడికించండి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడకాలి.
-సాంబార్ పూర్తిగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుంచి దించేసేయాలి. అంతే మామిడికాయ మునక్కాయ సాంబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications