Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
దోసకాయ మటన్..అన్నం,చపాతీలోకి అద్భుతం..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
దోసకాయ మటన్ కర్రీ అనేది ఒక సాంప్రదాయ, రుచికరమైన వంటకం. దీనిని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వండుతారు. మటన్ తో కలిపిన దోసకాయ కూర, మాంసం ప్రియులకు ఒక కొత్త రుచిని, అనుభూతిని ఇస్తుంది. దోసకాయలో ఉండే నీటి శాతం, మటన్ కర్రీని మరింత రుచికరంగా, మృదువుగా మార్చుతుంది. సాధారణంగా చేసే మటన్ కర్రీకి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. ఈ వంటకం ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనిని వేడి వేడి అన్నం,చపాతీతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. దోసకాయ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
దోసకాయ మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మటన్
-దోసకాయ
-లవంగ మొగ్గలు
-దాల్చిన చెక్క
-ధనియాల పొడి
-ఆయిల్
-టమాటో
-ఉల్లిపాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చిమిరపకాయ
-ఉప్పు
-కారం
-పసుపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి

దోసకాయ మటన్ తయారీ విధానం
-అరకేజీ మటన్ ని శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేయండి, ఇందులో 1 టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి మొత్తం కలిపి కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ రానివ్వాలి. మటన్ మెత్తగా ఉడకాలి.
-మటన్ ఉడికేలోగా పచ్చిగా,గట్టిగా ఉన్న ఒక దోసకాయను తీసుకొని పైన చెక్కు అంతా తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి.
-2 ఉల్లిపాయలు, 1 టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసి 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు వేసి లైట్ గా వేయంచాక ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా చీరుకున్న 3 పచ్చిమిరపకాయలు, 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేదాకా వేయించండి.
-తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచిన 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించాక ఇందులోనే టమాటో ముక్కలు కూడా వేసి అవి మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి.
-తర్వాత అందులో కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు తక్కువ మంట మీద వేయించాలి.
-దోసకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కారం 3 టీస్పూన్లు, రెండున్నర టీస్పూన్ల ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి.
-ఇప్పుడు ఇందులో ఉడికించిన మటన్ మొత్తాన్ని వేసి బాగా కలిసేట్లు కలుపుకోండి. కావాలనుకుంటే కొద్దిగా మటన్ మసాలా వేసుకోండి.
-ఇప్పుడు అందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్లు, రుచికి సరిపడా,ఉప్పు,కారం చూసుకొని వేసుకోండి. మూతపెట్టేసి మీడియం మంట మీద దోసకాయ ముక్కలు మెత్తగా అయ్యేదకా ఉడికించుకోవాలి.
-చిక్కటి గ్రేవీగా అయ్యాక అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చసేయండి. అంటే దోసకాయ మటన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications