స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్..ఇలా చేసుకుంటే ఇంట్లోనే అద్భుతమైన రుచి

Posted By:

పట్నం అయినా పల్లెటూరు అయినా సాయంత్రం పూట అలా రోడ్డు మీదకు వెళ్తే మనకు ఎక్కడ పట్టినా నూడిల్స్ బండ్లు కనబడుతుంటాయి. అటు చూడగానే మనసు ఎప్పుడెప్పుడు తిందామా అని పీకుతుంటది. ముఖ్యంగా చాలామంది తినడానికి ఇష్టపడే వాటిల్లో ఎగ్ నూడిల్స్ ఒకటి. ఇంట్లో ఇలాంటి టేస్ట్ రాదు అనుకుంటూ స్ట్రీట్ బండ్ల దగ్గర ఎగ్ నూడిల్స్ లాగించేస్తుంటారు. అయితే స్ట్రీట్స్ లో బండ్ల మీద దొరికే టేస్టీ ఎగ్ నూడుల్స్‌ ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-నూడిల్స్
-కారం
-వెనిగర్
-సోయా సాస్
-మిరియాల పొడి
-గరం మసాలా పొడి
-రెడ్ చిల్లీ సాస్
-కోడిగుడ్లు
-ఉప్పు
-ఉల్లిపాయ
-క్యాప్సికం
-క్యారెట్
-క్యాబేజి
-ఆయిల్

super tasty street style egg noodles recipe in telugu

తయారీ విధానం

-ముందుగా నూడిల్స్ ను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇందులో స్టవ్ మీద పెద్ద గిన్నెపెట్టి అందులో 1 లీటరు నీళ్లు పోయాలి,నీళ్లలోనే 1 టీస్పూన్ ఆయిల్ వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి.

-నీరు బాగా మరిగి తెర్లుతున్నప్పుడు అందులో 1ప్యాకెట్ ప్లెయిన్ నూడిల్స్(140 గ్రాముల) ను వేసి 70-80శాతం వరకు ఉడికించి స్టవ్ ఆపేసి వెంటనే గిన్నెలో కొద్దిగా కూలింగ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేయండి. దీనివల్ల నూడిల్స్ ఎక్స్ ట్రా ఉడకకుండా ఉంటాయి.

-తర్వాత నూడిల్స్ ని గిన్నెలో నుంచి తీసి ఓ ప్లేట్ లో వేసుకోండి. నూడిల్స్ మీద చెంచాడు నూనె వేసి అది నూడిల్స్ మెత్తానికి పట్టేలా చేతులతో కలుపుకోవాలి. ఈ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ చేసుకోవచ్చు లేదా చికెన్ నూడిల్స్ లేదా నచ్చిన ఫ్లేవర్ లో నూడిల్స్ తయారుచేసుకోవచ్చు.

-ఇఫ్పుడు ఎగ్ నూడిల్స్ తయారీకోసం ఓ గిన్నెలో నాలుగు కోడిగుడ్లు కొట్టి వేయాలి,ఇందులో కొంచెం ఉప్పు వేసి స్పూన్ తో బాగా బీట్ చేయాలి.

-తర్వాత స్టవ్ మాద వెడల్పాటి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడి చేశాక అందులో కోడిగుడ్డు మిశ్రమిన్ని వేసి నెమ్మదిగా గరిటతో కలుపుతూ లావాటి ఆమ్లెట్ లా చేసుకోవాలి.

-తర్వాత బాండీలో ఆమ్లెట్ ని పీసులుగా బ్రేక్ చేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు ఉల్లిపాయ చీలికలు, పావు కప్పు క్యాప్సికం తరుగు, పావు కప్పు క్యారెట్ తురుము, కొద్దిగా క్యాబేజి తురుము,రుచికి సరిపడా ఉప్పు 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.

-తర్వాత అందులో ఉడికించిన నూడిల్స్ వేసి 2 నిమిషాలు పెద్ద మంట మీద కలుపుతూ వేయించాలి.

-తర్వాత అందులో 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ గరం మసాలా పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి,రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా 2 నిమిషాలు కలుపుకున్నాక అందులో 1 టీస్పూన్ వెనిగర్, 1 టీస్పూన్ సోయా సాస్, 1 టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి పెద్ద మంట మీద 2 నిమిషాలు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎగ్ నూడిల్స్ రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion