Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రాఖీ స్పెషల్..స్వీట్ షాప్ కి మించిన టేస్ట్ తో ఇంట్లోనే కాజు బర్ఫీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
కాజు బర్ఫీ లేదా కాజు కట్లి అనేది జీడిపప్పుతో తయారుచేసే ఒక రుచికరమైన భారతీయ స్వీట్. ఇది ఏ పండుగకైనా ముఖ్యంగా రక్షా బంధన్, దీపావళి వంటి పండుగలకు చాలా సరైన ఎంపిక. ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 9న జరుపుకుంటారు. ఈ పండుగను రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. రాఖీ పండుగ రోజు చెల్లెలు,అక్కలు..తమ సోదరుడికి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంటారు. రక్షా బంధన్ పండుగకు సోదరుడికి పెట్టే తినుబండారాలలో కాజు బర్ఫీ చాలా ముఖ్యమైనది. ఇది చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో కాజు బర్ఫీ చాలా పాపులర్ స్వీట్ గా ఉంటుంది. అన్ని స్వీట్ షాపుల్లో ఇది దొరుకుతుంది..అయితే దీని ధర కూడా కొంచెం ఎక్కువే కాబట్టి దీనిని ఇంట్లోనే తయారుచేసుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది..రుచి కూడా పెరుగుతుంది. కాజు బర్ఫీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కాజు బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
జీడిపప్పు-150 గ్రాములు)
పంచదార-100 గ్రాములు
నీళ్లు - పావు కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
వెండి రేకు- అలంకరణ కోసం
కాజు బర్ఫీ తయారీ విధానం
ముందుగా జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. అయితే పౌడర్ చేసేటప్పుడు మిక్సీని ఎక్కువసేపు తిప్పకూడదు. మధ్యమధ్యలో ఆపుతూ తిప్పితే జీడిపప్పులోంచి నూనె రాకుండా ఉంటుంది. జల్లెడతో జల్లించి, పెద్ద ముక్కలు ఉంటే మళ్లీ మెత్తగా చేసుకోవాలి.
తర్వాత స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో చక్కెర, నీళ్లు పోయండి. పంచదార పూర్తిగా కరిగి పాకం ఒక తీగ పాకం లాగా రావాలి. పాకాన్ని తనిఖీ చేయడానికి ఒక చుక్క పాకాన్ని వేలితో తీసి, బొటనవేలు, చూపుడువేలు మధ్య పెట్టి చూడండి. ఒక తీగలాగా వస్తే పాకం సిద్ధమైనట్టే.
పాకం సిద్ధమయ్యాక మంటను తగ్గించి మెత్తగా చేసుకున్న జీడిపప్పు పొడిని ఇందులో కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసి బాగా కలపండి. ఇది గట్టిపడి, ముద్దలా మారే వరకు తిప్పుతూ ఉండాలి.
ఈ మిశ్రమం పాన్ నుండి సులభంగా ఊడి వచ్చేటప్పుడు స్టవ్ ఆపేయండి.
ఇప్పుడు ఆ మిశ్రమంలోనెయ్యి వేసి బాగా కలపాలి. ఈ ముద్దను ఒక గ్రీజ్ చేసిన పళ్లెంలో వేసి కాస్త చల్లబడనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో బాగా కలపాలి.
బర్ఫీ ముద్దను ఒక మందపాటి పేపర్ లేదా ప్లాస్టిక్ షీట్ పై పెట్టి,చపాతీ కర్రతో కాస్త మందంగా ఉండేలా ఒత్తాలి. దీనిపైన వెండి రేకుతో అలంకరించి డైమండ్ ఆకారంలో ముక్కలుగా కత్తిరించాలి. అంతే టేస్టీ కాజు బర్ఫీ రెడీ.
కాజు బర్ఫీ పూర్తిగా చల్లబడిన తర్వాత, ముక్కలను తీసి ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications