Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
నోట్లో వేస్తే కరిగిపోయే దూదిలాంటి గులాబ్ జామున్..స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మనదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వీట్ అంటే ఠక్కున వినిపించే పేరు గులాబ్ జామున్. ఆ పేరు వినగానే మనసులో ఏదో తెలియని మాధుర్యం, నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. పండుగైనా, పుట్టినరోజైనా, ఇంటికి అనుకోని అతిథులు వచ్చినా, లేదా భోజనం తర్వాత ఏదైనా తీపి తినాలనిపించినా..అందరి ఓటు గులాబ్ జామున్ కే.
అయితే బయట స్వీట్ షాపుల్లో దొరికే జామ్ లు ఎంత బాగుంటాయో, ఇంట్లో చేసేటప్పుడు చాలామందికి అంత పర్ఫెక్ట్ గా రావు. కొందరికి రాళ్లలా గట్టిగా తయారైతే, మరికొందరికి నూనెలో వేయగానే విరిగిపోతుంటాయి. అసలు స్వీట్ షాపు స్టైయిల్ లో దూదిలాంటి మెత్తటి, జ్యూసీ గులాబ్ జామున్లను మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కోవా (ఖోయా): 100 గ్రాములు
మైదా లేదా బాంబే రవ్వ: 1 టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా: పావు టీస్పూన్
పంచదార: 2 కప్పులు
నీరు: 2 కప్పులు
యాలకులు: 4
పాలు:2 టేబుల్ స్పూన్లు
నెయ్యి లేదా నూనె: వేయించడానికి
తయారీ విధానం
-గులాబ్ జామున్ మృదువుగా రావాలంటే పిండి కలపడమే ముఖ్యం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో కోవాను తీసుకుని ఉండలు లేకుండా మెత్తగా చేయాలి. ఇప్పుడు దానికి మైదా, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా గట్టిగా పిసికి కలపకూడదు. కేవలం మీ వేళ్లతో మృదువుగా, సున్నితంగా కలపాలి. అవసరమైతే కొద్దిగా పాలు చిలకరించుకుని మెత్తని ముద్దలా చేయాలి.
-ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కలిపిన పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. బాల్స్ మీద ఒక్క పగులు కూడా లేకుండా నునుపుగా ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి లేదా నూనె పోసి వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టి జామున్లను వేయండి. గరిటెతో జామున్లను తాకకుండా, నూనెను కదిలిస్తూ ఉంటే అవి అన్ని వైపులా సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని నూనెలో నుంచి బయటకు తీయండి.
-ఇప్పుడు మరొక గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. చక్కెర కరిగే వరకు కలపాలి. తీగ పాకం అవసరం లేదు. పాకం చేతికి కొంచెం బంకగా తగిలితే చాలు. ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆపి పాకాన్ని వడకట్టుకోవాలి. చివరగా యాలకుల పొడి వేస్తే అద్భుతమైన వాసన వస్తుంది.
-వేయించిన గులాబ్ జామున్లను వెంటనే గోరువెచ్చని పాకంలో వేయాలి. పాకం మరీ వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా ఉండకూడదు. జామున్లను పాకంలో కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పాకం జామున్ లోపలి పొరల వరకు వెళ్లి, అవి ఉబ్బి, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా తయారవుతాయి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి గులాబ్ జామున్లు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications