For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ కేసరి బాత్ : హోళీ స్పెషల్ డిష్

|

రేపు హోళీ ... అందరూ ఉత్సాహంగా జరుపుకొనే ఒక రంగుల పండుగ. ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట చేర్చారా అన్నంత ఆందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరిపుకొనే హోళీ అంటే చిన్నా, పెద్దా అందరికీ ప్రియమే...! వయస్సుతో భేదం, ఆడ, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఇటువంటి హోళీ రోజును కలర్ ఫుల్స్ స్వీట్ తోడైతే ఆ ఆనందాలకు అడ్డు ఏమి..వచ్చిన బందువులతో హోళీ రంగు కేళీ..జయహోళీ అవుతుంది.

పొట్టాల నిండి రంగులపొడితో బకెట్ల కొద్దీ రంగు నీళ్ళతో గడప వరకూ నిలబడింది హోలీ! ఈ రంగుల హోళీ మీ బుగ్గల్ని, బట్టల్నీ ముద్దాడేందుకు ఇంకా రెండు రోజులే ఉంది కాన..దైర్యంగా వచ్చి వాకిట్లో నిలబడండి ప్రకృతి విరగబడి రంగులను కాస్తోంది. మబ్బుల్లో రంగుల ధూళికణాలై హరివిల్లు కురుస్తోంది. అయినా మన దగ్గర లేని రంగులా?!రండి, రెడీ అవుదాం. ఆప్తుల పెదవులకు తియ్యటి రంగులు అద్దుదాం వెరైటీగా...హోలీ స్వీట్ తో..

Rice Kesari Bhaat Recipe For Holi

కావల్సిన పదార్థాలు:
రైస్ : 1cup(నానబెట్టుకోవాలి)
Ghee: ¼cup
ఎండుద్రాక్ష: 3tbsp
జీడిపప్పు : 2tbsp
ఏలకుల పొడి : ½tsp
పంచదార: ¾cup
కేసర్(కుంకుమ పువ్వు)కొద్దిగా: గార్నిష్ చేయడానికి

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఎండు ద్రాక్ష వేసి ఒక సెకను ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత అందే పాన్ లో కొద్దిగా జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ ఫ్రై చేసి, అవికూడా పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి అందులో కడిగి పెట్టుకొన్న బియ్యం వేసి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో యాలకల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూనే అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి , మీడియం మంట మీద బియ్యంను మెత్తగా ఉడికించుకోవాలి. నీళ్ళు బియ్యం రెండు బాగా కలగలిసిపోయి, మెత్తగా ఉడికే వరకూ మీడయం మంట మీద ఉడికించుకోవాలి .
5. ఉడికే సమయంలోనే అందులో కొద్దిగా పంచదార కూడా వేసి మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి.
6. అంతే రైస్ కేసరి బాత్ రెడీ. అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న నట్స్ మరియు జీడిపప్పును గార్నిష్ గా వేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ రైస్ కేసరి బాత్ రెడీ.

English summary

Rice Kesari Bhaat Recipe For Holi

Holi 2015 should be celebrated with grandeur. With all the colour in the air, you should make time to prepare a sweet treat for those who visit your home to join in the festivities. For the occasion of Holi, we have an awesome recipe you can try out this afternoon.
Story first published: Thursday, March 5, 2015, 17:35 [IST]
Desktop Bottom Promotion