For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ : హల్వా రిసిపిలు

|

సంవత్సరంలో మొత్తంలో అతి పెద్ద పండుగ నవరాత్రి. ఎందుకంటే ఈ పండుగను 9 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ నవరాత్రులు లేదా దసరా పండుగ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వస్తుంది . ముఖ్యంగా ఆ పండుగ యొక్క ప్రత్యేకతల్లో ఫుడ్, పూజ మరియు డ్యాన్స్. ముఖ్యంగా ఆహారాలు ఎక్కువ ప్రాధాన్యత చోటు చేసుకుంటాయి , ముఖ్యంగా స్వీట్ రిసిపిలు. స్వీట్స్ అంటే పిల్ల పెద్ద అందరికి అమితమైన ఇష్టం.

ఈ దసర అండ్ నవరాత్రుల సమయంలో స్వీట్స్ వివిధ రకాల స్వీట్స్ తో ఇల్లంతా ఘుమఘుమలతో నిండిపోతుంది. ముఖ్యంగా నవరాత్రిలకు నార్త్ ఇండియన్స్ రబ్దీ స్వీట్స్ తయారుచేసుకోవడంలో చాలా ఫేమస్. అలాగే హల్వా, ఖీర్, మరియు మరికొన్ని బెస్ట్ స్వీట్స్ ను తయారుచేసుకోవడం సౌత్ స్పెషల్.

మరి ఈ నవరాత్రి స్పెషల్ గా మీరు తయారుచేసుకోగల కొన్ని బెస్ట్ స్వీట్ అండ్ టేస్టీ హల్వా రిసిపిలున్నాయి . ముఖ్యంగా హల్వా రిసిపిల్లో క్యారెట్ హల్వా, గుమ్మడి హాల్వా, బాదం హల్వ, ఆలూ హల్వా....మరి ఇకెందుకు ఆలస్యం మీకోసం కొన్ని బెస్ట్ హల్వా రిసిపిలను ఈ క్రింది లిస్ట్ లో అందిస్తున్నాము ... ఈ నవరాత్రి సమయంలో తయారుచేసుకొనే స్వీట్ టేస్ట్ తో ఎంజాయ్ చేయండి...

1. క్యారెట్ హల్వా:

1. క్యారెట్ హల్వా:

క్యారెట్ స్వీట్ హల్వా తయారుచేయడానికి కొంత సమయం తీసుకుంటుంది, కానీ ఈ స్వీట్ డిష్ యొక్క ఫ్లేవర్ మరియు టేస్ట్ ను బట్టి మీరు ఓపికగా తయారుచేసుకుంటారు. క్యారెట్ హల్వాను రెండు పద్దతుల్లో తయారుచేస్తారు. ఒకటి పాలను ఉపయోగించి తయారుచేస్తే, రెండవది కోవాను ఉపయోగించి తయారుచేసుకుంటారు . కోవా పాలతో తయారుచేసేటటువంటి ఒక చిక్కటి పదార్థం. దీన్ని అనేక ఇండియన్ స్వీట్ డిష్ గులాబ్ జామూన్ క్యారెట్ హల్వాలలో ఉపయోగిస్తుంటారు. మీకు క్యారెట్ హాల్వా ఇష్టమైతే మరియు ఈ స్వీట్ డిష్ ను తయారుచేసుకోవాలనుకుంటే, ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా తెలుసుకోవాల్సిందే...

రిసిపి
2. గసగసాల హల్వా: టేస్టీ ఇండియన్ డిజర్ట్

2. గసగసాల హల్వా: టేస్టీ ఇండియన్ డిజర్ట్

ఆయుర్వేద వైద్యంలో గసగసాలను ఎక్కువగా ఉపయోగించి ఎన్నో ఔషధాలను తయారుచేస్తున్నారు. రోజూకొన్ని గసగసాలు తింటే మంచిదని చెబుతుంటారు. ఇవి రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి, వీటితో ఒక స్వీట్ హల్వా తయారు చేస్తే టేస్ట్ కు టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. గసగసాలతో స్వీట్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం...

రిసిపి

3. సొరకాయ హల్వ: టేస్టీ అండ్ యమ్నీ డిష్

3. సొరకాయ హల్వ: టేస్టీ అండ్ యమ్నీ డిష్

సొరకాయ హల్వ చాలా పాపులర్ అయినటువంటి ట్రెడిషనల్ డిజర్ట్, దీన్ని మన ఇండియాలో అన్ని ప్రదేశాల్లో తయారుచేస్తారు . ముఖ్యంగా ఆ సొరకాయను ఉపవాసాలున్న సమయంలో చాలా మంది ఇల్లల్లో దీంతో తయారుచేసిన ఆహారాలను అల్పాహారంగా తీసుకుంటారు. సొరకాయను వివిధ రకాల వంటలను తయారుచేసుకోవచ్చు. అయితే సొరకాయతో తయారుచేసి స్వీట్ డిష్ మాత్రం అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.

రిసిపి

4. ఆలూ కా హల్వా :

4. ఆలూ కా హల్వా :

బంగాలదుంపతో ఏ వంటలు చేసినా చాలా టేస్టీగా మరియు యమ్నీగా ఉంటుంది. మరియ ఆలూ హల్వా ఏలా తయారుచేయాలో చూద్దాం...

రిసిపి

5. ఖర్జూరం హల్వా:

5. ఖర్జూరం హల్వా:

ఖర్జూరాలు మంచి పోషక విలువలు కలవి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటంతో తక్షణ ఎనర్జీని అందిస్తుంది. అందుకే నవరాత్రి ఉపవాసాల సమయంలో వీటికి అంత ప్రత్యేకత. మరి తక్షణ శక్తినిచ్చే ఈ ఖర్జూరాలతో తయారుచేసే హల్వాకు కూడా క్రేజ్ ఎక్కువే. మరి ఈ టేస్టీ అండ్ స్వీట్ డేట్స్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం...

రిసిపి

6. గుమ్మడి హల్వా:

6. గుమ్మడి హల్వా:

క్యారెట్ కు గుమ్మడి తురుము జోడించి తయారు చేసే హాల్వా డిఫరెంట్ ఫ్లేవర్ తో పాటు అద్భుతమైన రుచి ఉంటుంది. హల్వా మన ఇండియన్ డిషెస్ లో ప్రధానమైనది. క్యారెట్, గుమ్మడి రెండింటి మిశ్రమంతో తయారుచేసే ఈ హల్వాలో ప్రోషకాంశాలు అధికంగా ఉంటాయి. ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, కె పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ హల్వా వింటర్ స్పెషల్ గా తయారుచేసుకుంటారు. ఎందుకంటే వింటర్ లో క్యారెట్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి. మరి ఈ క్యారెట్ గుమ్మడి హల్వాను ఎలా తయారుచేయాలో చూద్దాం...

రిసిపి

7. బాదం హల్వ:

7. బాదం హల్వ:

బాదం హల్వా రిసిపిని చాలా ట్రెడిషినల్ గా తయారుచేసుకుంటారు. సహజంగా బాదం హల్వాను పండుగ సందర్బాల్లో తయారుచేసుకోరు. అయితే స్పెషల్ గా ఉండటం కోసం అని ఇలాకూడా తయారుచేసుకోవచ్చు. ఇది చాలా బేసిక్ ఇండియన్ స్వీట్ డిష్. దీన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. కాబట్టి మీరు కూడా ఈ బాదం హల్వాను తయారుచేసి, మీ కుటుంబ సభ్యులను సంతోషపరచండి.

రిసిపి

English summary

Awesome Halwa Recipes For Navratri

Navratri is a nine day long festival that falls every year in the month of September or October. The most important part of the festival is the food, puja and dance. Food takes the top priority, especially the sweet recipes. A variety of sweet recipes are prepared to be relished during the festival. If rabdi is famous in North India, halwas are some of the best sweets in South India.
Story first published: Saturday, October 17, 2015, 16:55 [IST]
Desktop Bottom Promotion