బాదుషా రెసిపీ: ఇంట్లోనే బాదుషా తయారుచేసుకునే విధానం!

Posted By: Ashwini Pappiredd
Subscribe to Boldsky

సాధారణంగా పండుగ ఉత్సవాలు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేవి పిండివంటకాలు అందులోనూ యమ్మీ యమ్మీ స్వీట్స్. మన భారతీయులందరూ ప్రత్యేకంగా మరియు తప్పకుండా తయారుచేసుకునే సాంప్రదాయ వంటకం బాదుషా. ఉత్తర భారతదేశంలో ఈ బాదుషా నే బాలుషాహి అని పిలుస్తారు.

ఈ బాదాషా మైదా పిండి, పెరుగు, నెయ్యి మరియు చిటికెడు బేకింగ్ సోడా వంటి పిండివంటకాలతో తయారుచేస్తారు. ఈ పిండి ని ముందుగా ముద్దగా గుండ్రని ఆకారంలో తయారుచేసుకొని నూనెలో వేయించాల్సి ఉంటుంది. ఆ తరువాత చక్కర పాకులో కాసేపు ఉంచి తీసేయాలి.

అంతేకాక, మైసూర్ పాక్, ఓబ్బాట్టు, 7 కప్పుల బర్ఫీ, జలేబి వంటి తీపి వంటకాల తయారీ విధానం తెలుసుకోండి.

బాదుషా లేదా బాలుషాహి బయట క్రిస్పీ గా మరియు లోపల మెత్తగా వుంటూ నోట్లో పెట్టుకోగానే మెల్లగా కరిగిపోతుంది. పిండివంటకంతో తయారుచేసి నూనెలో వేయించిన మరియు బయట చక్కెర పాకులో ముంచిన బయటి భాగం మీ నోటి ని తియ్యగా చేస్తుంది.

బాదుషా ని తయారుచేయడం చాలా చాలా సులభం. ఇక్కడ అన్ని పదార్థాలను సరైన క్వాంటిటీ లో కలపడం కాస్త కష్టతరమైన పని. ఒక క్రిస్ప్ మరియు మెత్తటి బాదుషా ని పొందడానికి, సరైన భాగంలో కలపడం ఖచ్చితంగా తెలుసుండాలి. అలాగని తెలిసిఉంటే ఈ రెసిపీ ని చేయడానికి చెఫ్ లు అయుండాల్సిన పనిలేదు.

సో, మీరు ఈ వంటకాన్ని మీఇంట్లోనే ప్రయత్నిచాలనుకుంటున్నారా? అయితే మీకోసమే సిద్ధం చేసిన ఈ క్రింది వీడియోని చూసి తెలుసుకోండి. మరియు స్టెప్ బై స్టెప్ తయారీ విధానాన్ని అనుసరించండి.

బాదుషా వీడియో రెసిపీ బాదుషా

recipe

స్టెప్ బై స్టెప్- బాదుషా ని తయారుచేయడం ఎలా

1. ఒక గిన్నెలో కాస్త నెయ్యిని తీసుకోండి.

recipe

2. దానికి పెరుగు జోడించండి.

recipe

3.బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి.

recipe
recipe

4. ఫై మిశ్రమాలన్నింటిని బాగా కలపండి.

recipe

5.ఇప్పుడు మైదాని ఒక కప్పు వేసి బాగా కలపాలి.

recipe

6. ఈ మిశ్రమం మొత్తం మెత్తగా చేతికి అంటుకోకుండా ఉండేంతవరకు దానిని బాగా కలపండి.

recipe

7. ఇప్పుడు అందులోనుండి కొంత భాగాన్ని తీసుకొని మీ అరచేతుల సహాయం తో పిండిని గుండ్రంగా చేయండి.

recipe
recipe

8. ఇప్పుడు ఒక టూత్పిక్ వుపయోగించి మరియు మధ్యలో ఒక చిన్న రంద్రం చేయండి.

recipe

9. దానిని పాన్ లో ఆయిల్ లో ఫ్రై చేయండి.

recipe

10. ఇదే విధంగా మరికొన్ని ముక్కలను ఆయిల్ లో ఒక దాని తర్వాత ఒకటి అంటుకోకుండా వేయండి.

recipe

11. వాటిని తక్కువ మంట మీద వేడి చేయండి.

recipe

12. మరొక వైపు కూడా ఉడికించడానికి తిప్పుతూ ఉండాలి.

recipe

13. రెండు వైపులా బంగారు గోధుమ రంగు మారిపోయేంత వరకు వేయించాలి.

recipe

14. గోధుమ వర్ణంలోకి మారాక వాటిని బయటకి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.

recipe

15. ఇంతలో, మరొక పాన్ లో, చక్కెర ను తీసుకోండి.

recipe

16. దానికి తగినంత నీటిని కలపండి.

recipe

17. చక్కెర కరగడానికి మరియు సిరప్ వేడి అవడానికి సుమారు 2 నిముషాలు ఉండనివ్వండి.

recipe

18.తరువాత పాకం చిక్కబడ్డాక స్టవ్ ని ఆపేయండి.

recipe
recipe

19.ఇప్పుడు చక్కెర సిరప్లో ఫ్రై చేసుకున్న వాటిని కలపండి.

recipe

20. దీనిని 10-15 నిమిషాలు నానబెట్టండి.

recipe

21. బాగా మెత్తబడిన తరువాత సిరప్ నుండి ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.

recipe

22. షుగర్ సిరప్ అంతా ఆవిరి అయిన తర్వాత, బాదుషా రెడీ అయినట్లే.

recipe

[ of 5 - Users]