For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్టమస్ స్పెషల్ : బనానా హేజిల్‌నట్ లోఫ్ తయారీ

By Lekhaka
|

ఈ క్రిస్టమస్‌కి బనానా వాల్నట్ లోఫ్ చేస్తే ఎలా ఉంటుంది??మృదువుగా,తియ్యగా ఉండే ఈ డెజర్ట్ మీ క్రిస్టమస్‌ని మరింత ప్రకాశవంతం చేస్తుంది.

దీని తయారీలో మీ పిల్లలని కూడా భాగస్వాములని చేస్తే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చేస్తారు.ఇక దీని తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం చూద్దామా.

శీతాకాలం వచ్చిదంటే ఎన్నో రకాలా కేక్స్, పేస్ట్రీలు, పుడ్డింగ్స్, రకరకాల లోఫ్‌లు,ఫ్రూట్ కేక్స్,మిక్స్డ్ ఫ్రూట్ లోఫ్, సాల్టెడ్ పుడ్డింగ్స్ చేసుకుంటుంటాము కదా.ఇవి మన శీతాకాలాన్ని మరింత ఉత్సాహభరితం చేస్తాయి.మన పట్టణాల్లో కూడా అనేక బేకరీలు రకరకాల డెజర్ట్స్‌ని తయారు చేసి అమ్ముతుంటాయి.కానీ బయట తయారు చేసినవి కొనుక్కురావడం కంటే మీరే మీ కుటుంబ సభ్యుల కోసం స్వయంగా వీటిని తయారుచేస్తే వాళ్ళెంతో సంతోషిస్తారు.

ఎంత మందికి సరిపోతుంది-ఒక లోఫ్ తయారవుతుంది

ప్రిపరేషన్ టైం-20 నిమిషాలు

కుకింగ్ టైం-20 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

1.అరటి పళ్ళు-3

2.మైదా-1 1/2 కప్పు

3.వెన్న-1/2 కప్పు

4.పంచదార-1/2 కప్పు

5.చాక్లెట్ హేజిల్నట్ స్ప్రెడ్-1/2 కప్పు

6.గ్రుడ్లు-2

7.సన్నగా తరిగిన హేజిల్ నట్-1/2 కపు

8.ఉప్పు-చిటికెడు

9.వనిల్లా ఎసెన్స్-2 లేదా 3 చుక్కలు

10.బేకింగ్ పౌడర్-1 1/2 టీ స్పూను

11.పాలు-1/4 కప్పు

తయారీ విధానం:

1.ఒక గిన్నెలో పంచదార, వెన్న వేసి రెండూ బాగా కలిసేవరకూ గిలక్కొట్టాలి.

బనానా నట్ లోఫ్ స్వీట్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్

2.దీనికి గ్రుడ్లు వేసి మరలా బాగా గిలక్కొట్టి 2-3 చుక్కల వెనీలా ఎసెన్స్ వెయ్యాలి.

బనానా నట్ లోఫ్ స్వీట్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్

3.ఇప్పుడు అరటి పళ్ళని సన్న ముక్కలుగా కొయ్యాలి.వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఫోర్కుతో బాగా మెత్తగా అయ్యేవరకూ చిదమాలి.ఇలా చిదిమిన అరటిపండ్ల గుజ్జుని గ్రుడ్డ్లు, పంచదార,వెన్న మిశ్రమమానికి కలపాలి.

బనానా నట్ లోఫ్ స్వీట్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్

4.దీనిలో చాక్లెట్-హేజిల్‌నట్ స్ప్రెడ్ వేసి మరలా బాగా కలపాలి.

5.బేకింగ్ పౌడర్,మైదా, ఉప్పుని పై మిశ్రమానికి చేర్చి కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో స్పాటులాతో కలపాలి.కలిపాకా ఈ మిశ్రమానికి పాలు,సన్నగా తరిగిన కొన్ని హేజిల్‌నట్స్ చేర్చాలి.

బనానా నట్ లోఫ్ స్వీట్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్

6.బ్రెడ్ లోఫ్ తయారీకి ఉపయోగించే పాత్ర తీసుకుని దానికి కాస్త వెన్న పూసి(గ్రీజ్ చేసి) పై మిశ్రమాన్ని పోసి పైన మిగిలిన హేజిల్‌నట్స్ వేసి గాలి చొరబడకుండా మూత పెట్టెయ్యాలి.

బనానా నట్ లోఫ్ స్వీట్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్

7.ఇప్పుడు 180 డిగ్రీ సెల్సియస్‌కి వేడి చేసి పెట్టుకున్న ఓవెన్‌లో లోఫ్ మిశ్రమాన్ని పెట్టి దాదాపు 30 నిమిషాలపాటు బేక్ చెయ్యాలి.

English summary

Banana Nut Loaf Recipe [Video]

Here's a great banana nut loaf recipe that you could try preparing this Christmas season!
Desktop Bottom Promotion