For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ : బేసన్ కి బర్ఫీ

By Staff
|

అక్టోబర్ ఒకటో తేది నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ దుర్గాదేవిని ఆహ్వానించడానికి సన్నాహాలు సన్నద్దం అవుతున్నాయి. హిందు సంప్రదాయంలోనే అతి పెద్ద పండుగ నవరాత్రి, 9 రోజుల పాటు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి, చాలా మంది ఈ పండుగ కోసం చాలా ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఈ పండుగను ఎక్కువ భక్తితో సెలబ్రేట్ చేసుకుంటారు .

ఇటువంటి అతి పెద్ద ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ముందు, ఈ పండుగ సమయంలో తయారుచేసే స్పెషల్ ఫుడ్ గురించి ఎలా మర్చిపోతారు, కొన్ని అమేజింగ్, స్వీట్స్, డిజర్ట్స్ లేకుండా పండగ సంత్రుప్తిగా పూర్తి అవ్వదు. అందువల్ల ఈ నవరాత్రికి ఒక స్పెషల్ స్వీట్ గా బర్ఫీని మరియు ఫెస్టివ్ ఫుడ్ ను తో స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సర్వ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ బేసన్ కి బర్ఫిన్ ను ఎలా తయారుచేయాలి? దీనికి ఉపయోగించాల్సిన పదార్థాలేంటో తెలుసుకోవాలంటే తయారుచేయు పద్దతి ఫాలో అవ్వాల్సిందే..

సర్వ్స్ - 6 పీసెస్

తయారుచేయు సమయం- 10నిముషాలు

తయారుచేయడానికి పట్టే సమయం - 20 నిముషాలు

కావల్సిన పదార్థాలు:

  • శెనగపిండి - 4 cups
  • నెయ్యి - 2 cups (గ్రీసింగ్ కోసం )
  • బాదంలు - 10 to 12 (సన్నగా కట్ చేసుకోవాలి)
  • పిస్తాలు - 10 to 12 (సన్నగా కట్ చేసుకోవాలి)
  • పంచదార - 2 cups (పొడి చేసుకోవాలి)
  • యాలకలపొడి - ½ a tsp

తయారుచేయు పద్దతి:

1.డీప్ బాటమ్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వెయ్యాలి.

Besan Ki Barfi- Navratri Special

2. నెయ్యి కరిగిన తర్వాత అందులో శెనగపిండి వేసి శెనగపిండిని బాగా మిక్స్ చేయాలి..

3. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ సన్న మంట మీద వేగించుకోవాలి.

Besan Ki Barfi- Navratri Special

4. నిధానంగా వేగిస్తుండాలి, మద్యలో కలియబెట్టడం వల్ల అడుగున మాడిపోకుండా ఉంటుంది.

Besan Ki Barfi- Navratri Special

5. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత అందులో యాలకపొడి వేసి మిక్స్ చేయాలి.

Besan Ki Barfi- Navratri Special

6.ఇప్పుడు అందులోనే పిస్తాలు, బాదం, వేసి మిక్స్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.

8. పాన్ లో నుండి బౌల్లోకి మార్చుకోవాలి.

Besan Ki Barfi- Navratri Special

9.ఈ మిశ్రమం మొత్తం చల్లారనివ్వాలి, అందువల్ల కొద్దిగా మందంగా తయారవుతుంది.

10.తర్వాత ఇందులోనే పంచదార పొడి మిక్స్ చేసి మొత్తం మిశ్రమం బాగా కలగలుపుకోవాలి.

Besan Ki Barfi- Navratri Special

11.చిక్కగా మందంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి.

Besan Ki Barfi- Navratri Special

12. ఇప్పుడు ఒక మరో పాన్ తీసుకుని అందులో అడుగు బాగంను నెయ్యి రాయాలి. ప్లేట్ మొత్తం నెయ్యిని అప్లై చేయాలి.

Besan Ki Barfi- Navratri Special

13.తర్వాత బేసన్ మిశ్రమం అందులోకి మార్చుకోవాలి. దీని మీద బాదంలను గార్నిష్ చేయాలి. 2,3 గంటలు అలాగే పక్కన పెట్టి, తర్వాత బర్ఫీ షేప్ లో లేదా మీకు నచ్చిన షేప్ లో బర్ఫీలను కట్ చేసుకోవాలి. అంతే నవరాత్రి స్సెషల్ గా బేసన్ కి బర్ఫీ రెడీ, దీన్ని చల్లగా సర్వ్ చేయవచ్చు, కోవ, మిల్క్ మెయిడ్ ఉపయోగించి మరింత స్వీట్ గా క్రీమిగా తయారుచేసుకోవచ్చు.

English summary

Besan Ki Barfi- Navratri Special

Navaratri is almost here and every household is preparing to welcome Goddess Durga. This is the biggest festival of the Hindu religion, for which all Hindus wait eagerly throughout the year.
Desktop Bottom Promotion