For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిస్కట్ లడ్డూ : దివాళి స్పెషల్ రిసిపి

దీపావళి అంటేనే బోలెడు నోరూరించే వంటకాలు.పిల్లలకి ఇష్టమైన స్వీట్లు, బాగా వేయించి చేసే చిరుతిళ్ళు చేసే పండుగ కావడంతో వారు దీనిని బాగా ఇష్టపడతారు.

By Staff
|

దీపావళి అంటేనే బోలెడు నోరూరించే వంటకాలు.పిల్లలకి ఇష్టమైన స్వీట్లు, బాగా వేయించి చేసే చిరుతిళ్ళు చేసే పండుగ కావడంతో వారు దీనిని బాగా ఇష్టపడతారు.

ఎప్పుడూ చేసుకునే స్వీట్లే కాకుండా ఈసారి ఏదైనా వెరైటీగా చెయ్యాలనుకుంటున్నారా??అయితే ఇది మీ కోసమే. బిస్కట్ లడ్డూ తయారీ క్రింద ఇచ్చాము చూడండి.దీని తయారీ చాలా సులువు పైగా ఎవ్వరూ ఇంతకుముందు దీనిని తిని ఉండరు కూడా.మరి ఈ లడ్డూ తయారు చేసి వారిని ఆశ్చర్య పరచండి.ఇక దీని తయారీ, కావాల్సిన వస్తువులు చూద్దామా..

ఎంత మందికి సరిపోతుంది-4

సామాను సమకూర్చుకోవడానికి-10 నిమిషాలు

తయారీ సమయం-25 నిమిషాలు

కావాల్సిన వస్తువులు:

1.మ్యారీ బిస్కెట్లు-ఒక ప్యాకెట్

2,కండెన్స్డ్ మిల్క్-అర కప్పు

3,కోకో పౌడర్-నాలుగు టేబుల్ స్పూన్లు

4.పాలు-రెండు టీ స్పూన్లు

5.డ్రై ఫ్రూట్స్-2 టేబుల్ స్పూన్లు(సన్నగా తరగాలి)

గార్నిషింగ్ కోసం

6.రెయిన్‌బో స్ప్రింక్లర్స్-ఒక టీ స్పూను

7.చాక్లెట్-అర కప్పుడు (సన్నగా తరగాలి)

8.తురిమిన కొబ్బరి-నాలుగు టేబుల్ స్పూన్లు

Biscuit Ladoo Recipe For Diwali

1.ఒక గ్రైండర్‌లో బిస్కట్లని మెత్తగా పొడి చేసుకోవాలి.

2.ఒక బౌల్ తీసుకుని దానిలో 2-3 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వెయ్యాలి.

Biscuit Ladoo Recipe For Diwali

3.కోకో పౌడర్ వేసి బాగా కలపాలి.

4.ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది.దీనిలో బిస్కట్ పౌడర్ వెయ్యాలి.

5.బిస్కట్ పౌడర్ వేసి బాగా కలిపి డ్రై ఫ్రూట్స్ వెయ్యాలి.

Biscuit Ladoo Recipe For Diwali

6.కావాలంటే మరి కాస్త కండెన్స్డ్ మిల్క్ వేసి ఇంకొంచం కోకో పౌడర్ కలపచ్చు. ఇలా చేస్తే లడ్డూలు మరింత మృదువుగా వస్తాయి.

7.కండెన్స్డ్ మిల్క్ మళ్ళీ కలిపితే కనుక ఈ మిశ్రమాన్ని సరిగ్గా ఇంకోసారి కలపాలి.అప్పుడే లడ్డూలని సరిగ్గా చుట్టగలము.

8.చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని లడ్డూ మిశ్రమాన్ని కొంచం చేతిలోకి తీసుకోండి.

Biscuit Ladoo Recipe For Diwali

9.లడ్డూ ఆకారంలో చేసి ప్లేటులో పెట్టుకోవాలి.

10.ఈ లడ్డూల లీద తురిమిన చాక్లెట్,తురిమిన కొబ్బరి, రెయిన్‌బో స్ప్రింక్లర్స్ వేసి అలంకరించాలి.

11,ఇలా అలంకరించుకున్న లడ్డూలని 10-12 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టి అతిధులకి సర్వ్ చెయ్యండి.

బిస్కట్ లడ్డూ తయరీ ఎంత సులభమో చూసారా??లడ్డూ వద్దనుకుంటే బిస్కట్ మిశ్రమాన్ని ట్రేలో పోసి డైమండ్ ఆకారంలో కూడా కోసుకుని బిస్కెట్ల లాగ చేసుకోవచ్చు.ఈ స్వీట్ ని మీకు నచ్చిన రీతిలో తయారు చేసుకుని మీ కుంటుంబంతో బంధుమిత్రులతో దీపావళిని ఆనందించండి.

English summary

Biscuit Ladoo Recipe For Diwali

Diwali means lots of yummy foods, and sweets take a special place among those. Diwali is one of the most favourite festivals for kids, as they are fond of sweets and fried foods.
Desktop Bottom Promotion