For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి స్పెషల్-చాక్లెట్ బర్ఫీ తయారీ(వీడియో..)

దీపావళి పండగ జరుపుకునేటప్పుడు స్వీట్లు లేకపోతే మజా ఉండదు అసలు.మోతీచూర్ లడ్దూ, కాజూ కత్లీ,బేసన్ లడ్డూ ఇత్యాదివి ప్రతీ ఇంట్లో చేస్తారు ఈ పండగ సందర్భంగా.కానీ ఈసారి దీపావళిని మరింత స్పెచల్గా జరుపుకోవడానిక

By Staff
|

దీపావళి పండగ జరుపుకునేటప్పుడు స్వీట్లు లేకపోతే మజా ఉండదు అసలు.మోతీచూర్ లడ్దూ, కాజూ కత్లీ,బేసన్ లడ్డూ ఇత్యాదివి ప్రతీ ఇంట్లో చేస్తారు ఈ పండగ సందర్భంగా.కానీ ఈసారి దీపావళిని మరింత స్పెచల్గా జరుపుకోవడానికి చాక్లెట్ స్వీట్స్ తయారీ ప్రయత్నించండి. ముఖ్యంగా ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది.

chocolate barfi recipe for diwali

ఎప్పుడూ చేసుకునే లడ్డూలూ బర్ఫీలనే కాస్త మార్చి దీపావళిని మరింత ప్రతేకంగా చేసుకోండి.ఈరోజు మేము చాక్లెట్ బర్ఫీ తయారీ ఇచ్చాము, ప్రయత్నించి చూడండి.

ఎంత మందికి సరిపోతుంది-4

కావాల్సినవి సమకూర్చుకోవడానికి పట్టే సమయం-10 నిమిషాలు

వండటానికి పట్టే సమయం-30 నిమిషాలు.

కావల్సిన పదార్ధాలు:

1.ఉప్పు లేని వెన్న కరిగించినది-55 గ్రాములు

2.పంచదార పొడి-25 గ్రాములు

3.బిస్కట్లు(పొడి చెయ్యాలి)-15

4.ఉప్పు-చిటికెడు

5.కండెన్స్డ్ మిల్క్-125 మిల్లీ లీటర్లు

6.తురిమిన కొబ్బరి-40 గ్రాములు

7.చాక్లెట్ చిప్స్-125 గ్రాములు

8.బాదం, పిస్తా మొదలైన ఎండు ఫలాలు-50 గ్రాములు

తయారీ విధానం:

1.ముందుగా ఒక గిన్నెలో ంపొడి చేసిన బిస్కెట్లు తీసుకుని దానిలో పంచదార పొడి,ఉప్పు కలిపి పక్కనుంచాలి.

chocolate barfi recipe for diwali

2.ముందుగా మీ ఓవెన్‌ని 180 డిగ్రీల సెల్సియస్లో వేడి చేసుకోవడం మర్చిపోవద్దు.ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో కరిగిన వెన్న వెయ్యాలి.

chocolate barfi recipe for diwali

3.దీనిలో బిస్కెట్ల పొడి మిశ్రమం కలపాలి.ఒక బేకింగ్ ట్రేలో ఈ మిశ్రమాన్ని పరచండి. బేకింగ్ ట్రేకి నెయ్యి రాయద్దు.

chocolate barfi recipe for diwali

4.ఒక గరిటెతో ఈ మిశ్రమాన్ని అదిమి దీని మీద కొబ్బరి చల్లండి.కొబ్బరి పైన చల్లాకా చాక్లెట్ చిప్స్ సమానంగా పరచండి.

chocolate barfi recipe for diwali

5.ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వంతు. పై నుండి ట్రే అంతా సమానంగా కండెన్స్డ్ మిల్క్ పొయ్యండి.

chocolate barfi recipe for diwali

6.ఇప్పుడు పైన బాదాం, పిస్తా లాంటి ఎండు ఫలాలు వేసి 25-30 నిమిషాలపాటూ బేక్ చేసి బర్ఫీ ఆకారంలో ముక్కలు కోసుకోండి.

chocolate barfi recipe for diwali

7.అంతే మీ చాక్లెట్ బర్ఫీ సిద్ధం. చేసుకోవడం సులువు పైగా చాలా తక్కువ సమయం పడుతుంది కూడా. దీనిలో ఉన్న కొబ్బరి, బాదం, పిస్తాలవల్ల ఈ స్వీటు ఆరోగ్యకరం కూడా.

English summary

chocolate barfi recipe for diwali

Diwali seems less colourful and bright if you don't have exciting desserts on this occasion. Motichur ke laddu, Kaju Katli, Besan ke Laddu, etc., are most common sweet dishes that are prepared in every household.
Desktop Bottom Promotion