For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకోనట్ బర్ఫీ: గణేష్ చతుర్ధి స్పెషల్

|

మరికొద్ది రోజుల్లో గణేష్ చతుర్థి రాబోతున్నది. విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. ముఖ్యంగా వినాయకుడికి స్వీట్స్ అంటే మహా ప్రీతి. మోదక్ అంటే వినాయకుడికి మహా ఇష్టం. అటువంటిదే మరో వంట కొబ్బరి బర్ఫీ. అందుకే గణేష్ చతుర్ధషికి చాలా వరకూ ఇండియన్ డిజర్ట్సే ఉంటాయి. కొబ్బరి బర్ఫీ చాలా వరకూ నార్త్ స్టేట్స్ లో చాలా ప్రసిద్ది చెందినది. నార్త్ లో కాదు, మన సౌత్ లో కూడా కొబ్బరి బర్ఫీకి మహా క్రేజ్.

పిల్లలకు అత్యంత ఇష్టమైన ఈ కొబ్బరి బర్ఫీని కండెన్స్డ్ మిల్క్ ను ఉపయోగించి తయారుచేయవచ్చు. ఈ గణేష్ చతుర్ధి రిసిపి చాలా త్వరగా మరియు ఈజీగా తయారుచేసేయవచ్చు. ఎక్కువ పదార్థలు అవసరం లేకుండానే చాలా సింపుల్ గా ఈ వంటను తయారుచేయవచ్చు. కండెన్స్డ్ మిల్క్ తీపిదనాన్ని పూర్తిగా అందిస్తుంది. చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వినాయకుడిని సమర్పించేందుకు రెడీ అయ్యిపోండి.

Coconut Burfi Recipe For Ganesh Chaturthi

కావల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుము: 3cups
కండెన్స్డ్ మిల్క్: 1 టిన్(బాగా కాచి వెన్నతీసేసిన పాలు)
యాలకుల పొడి : 1tsp
రోజ్ సిరఫ్: 1tbsp
నెయ్యి: 3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి, మంట కొద్దిగా ఎక్కువగానే పెట్టాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము వేసి, 5 నిముషాల పాటు డ్రై రోస్ట్ చేయాలి. మద్యమద్యలో కలియబెడుతుండటం వల్ల మాడిపోకుండా ఉంటుంది.
2. తర్వాత ఇలా రోస్ట్ చేసుకొన్న కొబ్బరి తురుమును ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, తర్వాత ఒక టిన్ కండెన్డ్స్ మిల్క్ ను అందులో పోసి కాస్తుండాలి.
4. ఇప్పుడు అందులో రోస్ట్ చేసి పెట్టుకొన్న కొబ్బరి తురుము, యాలకుల పొడి మరియు రోజ్ సిరప్ వేయాలి
5. మిక్స్ చేస్తూ కలియబెడుతూనే ఉండాలి. మద్యమద్యలో కొద్దికొద్దిగా నెయ్యి మిక్స్ చేస్తుండాలి .
6. 10నుండి 15 నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఒక పెద్ద ప్లేట్ తీసుకొని,నెయ్యి రాసి అందులో కొబ్బరి బర్ఫీ మిశ్రమాన్ని పోయాలి.
7. మొత్తం మిశ్రమం పోసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే, మీకు కావల్సిన ఆకారంలో చాకుతో వాటిని కట్ చేసుకోవాలి. చల్లబడిన తర్వాత కొబ్బరి బర్ఫీలను విడివిడిగా చేసి, ఫ్రిజ్ లో ఒక గంట పాటు పెట్టాలి. అంతే కొబ్బరి బర్ఫీ రెడీ. ఈ స్పెషల్ స్వీట్ ను గణేషుడికి నైవేద్యంగాను మరియు మీ అతిథులకు స్పెషల్ స్వీట్ గాను అందివ్వవచ్చు.

Story first published: Tuesday, August 19, 2014, 17:51 [IST]
Desktop Bottom Promotion