For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణనాథునికి ఇష్టమైన ‘‘కోకోనట్ షుగర్ మోదక్’’: టేస్టీ అండ్ యమ్మీ !

|

రెండు మూడు రోజుల్లో గణేష చతుర్థి రాబోతున్నది. దేశమంతా ఆనందంగా.. గ్రాండ్ గా జరుపుకునే ఈ పండుగ. గణేష చతుర్థి చవితి సందడి మొదలైంది.. 'గణపతి బొప్పా మోరియా' సందడి సందడిగా ఊరేగుతూ పందిళ్లకు చేరకుంటున్నాడు. ముఖ్యంగా 'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు.

'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణనాథునికి ఇష్టమైన 'మోదక్ లను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి స్వామికి ఇష్టమైన ఈ మోదక్ వంటకాన్ని రెండు పద్దతుల్లో తయారు చేసుకోవచ్చు. ఒకటి ఉడకపెట్టడం, రెండో విధానం వేయించడం. సులవైన విధానంలో ఈ వంటకాలను తయారు చేసుకోవచ్చు..

కొబ్బరి తురుము మరియు పంచదారతో తయారుచేసే మోదక్ చాలా టేస్ట్ గా ఉంటుంది. కోకనట్ షుగర్ మోదక్ ను తయారుచేయడానికి ఏఏ పదార్థాలు అవసరమవుతాయి, తయారుచేసే పద్దతి గురించి తెలుసుకుందాం..!

 Coconut & Sugar Modak Recipe For Ganesh Chaturthi

కావల్సిన పదార్థాలు:

స్టఫింగ్ కోసం

కొబ్బరి తురుము - 1 cup

పంచదార - ½ cup

యాలకలపొడి - a pinch

మిక్స్డ్ నట్స్ - 1 tbsp (powdered or finely chopped)

బెల్లం తురుము - ½ cup (smashed)

నెయ్యి - 2 to 3 tsp

గసగసాలు - 1 tsp

కోవా- 2 tsp (optional)

కొబ్బరి తురుము మరియు పంచద రిసిపి

కవరింగ్ కోసం :

బియ్యం పిండి - 1 cup

ఉప్పు - a pinch

నెయ్యి - ½ tbsp

వేడి నీళ్ళు - as per requirement

తయారుచేయు విధానం:

ముందుగా కవరింగ్ తయారీ

1. డీప్ బాటమ్ పాన్ లో నీళ్ళు పోసి మరిగించాలి.

2. తర్వాత అందులో ఉప్పు, నెయ్యి వేసి మిక్స్ చేయాలి.

3. ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకుని అందులో పిండి , కొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి.

4. ఇప్పుడు, ఈ పిండిని, బాయిల్ అవుతున్న నీటిలో వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి.

5. మంట తగ్గించి , మూత పెట్టి, కొన్ని నిముషాలు అలాగే ఉంచాలి. బియ్యం పిండి సాప్ట్ గా ఉడికే వరకూ అలాగే ఉంచాలి.

6. కొద్దిసేపటి తర్వాత స్టౌ మీద నుండి తీసి క్రింద దింపి పెట్టుకోవాలి.

7. పిండిని ఉండలు లేకుండా మరోసారి సాప్ట్ గా కలుపుకోవాలి.

8. కలిపేటప్పుడు కొద్దిగా నూనె లేదా నెయ్యి బాగా మిక్స్ చేయాలి.

9. డ్రైగా అనిపిస్తే, కొద్దిగా హాట్ వాటర్ ను ఉపయోగించి సాప్ట్ మరియు స్మూత్ గా పిండి కలుపుకోవాలి.

10. ఇప్పుడు, మోదక్ తయారుచేయడానికి పిండి రెడీ.

స్టఫింగ్ కోసం

1. పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి.

2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, గసగసాలు వేసి కొన్ని సెకండ్స్ వేగించుకోవాలి.

3. ఇప్పుడు అందులో, కొబ్బరి తురుము, బెల్లం తురుము, మిక్డ్స్ నట్స్, యాలకలపొడి, కోవ (సరిపడా)వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి.

4. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉడికించాలి, తేము పూర్తిగా తగ్గిపోయి, డ్రైగా మారే వరకూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి.

5. అడుగు బాగంలో మాడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

6. మద్యమద్యలో కలియబెడుతుంటే అడుగు అంటకుండా బ్రౌన్ కలర్ కి మారుతుంది

7. ఇది డ్రైగా మారే సమయంలో అందులో పాలు, నెయ్యి జోడించాలి. మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

8. మోదక్ తయారుచేయడాకి స్టఫింగ్ పదార్థం రెడీ

కోకనట్ షుగర్ మోదర్ రిసిపి

ఫైనల్ గా మోదక్ తయారుచేయు విధానం:

1. చేతిలోకి కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ తీసుకుని ముందుగా కవరింగ్ కోసం తయారుచేసుకున్న పిండి నుండి కొద్దిగా తీసుకుని చిన్న బాల్ లా చేయాలి.

2. ఈ బాల్స్ ను కోన్ షేప్ లో తయారుచేసుకోవాలి. కార్నర్స్ ను లో ప్రెజర్ కలిగించి చేతితో ఒత్తి పెట్టుకోవాలి. చివర్ల్ షార్ప్ గా ఒకే ఆకారంలో ఉండేట్లు తయారుచేసుకోవాలి.

3. ఇప్పుడు వీటిలో ముందుగా స్టఫింగ్ కోసం తయారుచేసుకున్న పదార్థాన్ని స్టఫ్ చేసి చేతి వేళ్లతో చివర్లను క్లోజ్ చేస్తూ, స్టఫ్ భయటకు రాకుండా జాగ్రత్తగా ఫింగర్స్ తో వత్తుకోవాలి.

4. ఇలా మొత్తం తయారుచేసుకుని ప్లేట్ టో రెడీ చేసి పెట్టుకోవాలి.

5. ఇప్పుడు వీటిని మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే , పాన్ లో నూనె పోసి వేడి అయ్యాక అందులో మోదక్ లు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

6. స్టీమింగ్ మోదక్ తయారుచేయడానికి అరటి ఆకులను తీసుకుని మోదక్ సైజ్ లో కట్ చేసి అందులో మోదక్ ను పెట్టి అరిటి ఆకును అన్ని వైపులా మోదక్ కవర్ చేస్తూ దారంతో కట్టేయాలి . తర్వాత ఇడ్లీపాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి.

7. మోదక్స్ ను 10 నిముషాలు స్టీమ్ చేస్తే చాలు, సర్వ్ చేయడానికి కోకనట్ షుగర్ మోదక్ రెడీ .

కోకనట్ అండ్ షుగర్ మోదక్ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మోదక్ రిసిపిని ఈ గణేష చతుర్థికి తయారుచేస్తే పిల్లలకు కూడా హ్యాపిగా ఫీలవుతారు.

English summary

Coconut & Sugar Modak Recipe For Ganesh Chaturthi

Ganesh Chaturthi is nearing and there is festivity in the air. This is one of the biggest festivals of Maharashtra, but today, people of other states are also celebrating it with vibrancy and passion.
Story first published:Friday, September 2, 2016, 12:04 [IST]
Desktop Bottom Promotion