For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష్ చతుర్థికి సులువుగా ఇంట్లో తయారుచేసిన డ్రై గులాబ్ జామున్ రెసిపీ

గణేష్ చతుర్థికి సులువుగా ఇంట్లో తయారుచేసిన డ్రై గులాబ్ జామున్ రెసిపీ

|

కృష్ణ జన్మాష్టమి తరువాత తదుపరి ముఖ్యమైన పండుగ 'గణేష్ చతుర్థి'. భద్రపాద మాసాలలో వచ్చే మొదటి పండుగ ఇది. గణేష్ చతుర్థి కూడా మన దేశమంతా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.

గణేష్ చతుర్థి రోజున గణేశుడికి ఇష్టమైన అనేక తీపి వంటకాలు తయారు చేస్తారు. కాబట్టి, ఈ గణేష్ చతుర్థి, మీ ఇంట్లో రుచికరమైన తీపి డ్రై గులాబ్ జామున్ రెసిపీని సిద్ధం చేయండి! అవును, ఈ పండుగ కోసం గులాబ్ జామున్ రెడీమేడ్ పిండిని బయట దుకాణాల్లో దొరుకుతుంది. లేదా బదులుగా గణేష్ చతుర్థి కోసం ఇంట్లో సులభంగా డ్రై గులాబ్ జామున్ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

పండుగ కోసం మీరు ఇంట్లో తయారుచేసే సాధారణ తీపి వంటకాల్లో ఇది ఒకటి. జామున్ ఎల్లప్పుడూ పిల్లలు మరియు పెద్దలకు ఇష్టమైనది కాబట్టి, ఇంట్లో తయారుచేసిన ఈ డ్రై జామున్ రెసిపీ మీ కుటుంబానికి మరింత ఆనందాన్ని మరియు సంతోషాన్ని ఇస్తుంది.

మరి ఇంకెందుకు వేచి ఉండాలి? గణేష్ చతుర్థి కోసం ఇంట్లో తయారుచేసిన డ్రై గులాబ్ జామున్ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

Homemade Dry Gulab Jamun

సర్వింగ్- 5

వంట సమయం - 10 నిమిషాలు

తయారీ సమయం - 20 నిమిషాలు

కావలసినవి:

ఖోవా- 250 గ్రా

పన్నీర్ - 100 గ్రా

మైదా - 2 టీస్పూన్లు

మిల్క్ పౌడర్ - 1 కప్పు

పాలు - 1 కప్పు

బేకింగ్ సోడా - 1/4 టీస్పూన్

చక్కెర - 2 కప్పులు

ఏలకులు- 1 టీస్పూన్

పొడి చక్కెర - 1/2 కప్పు

పొడి కొబ్బరి - 1/2 కప్పు

తయారీ విధానము:

  • పిండిని తయారు చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కోవా, తురిమిన పన్నీర్, మైదా మరియు పాలపొడిని జోడించండి.
  • అన్ని పదార్థాలను బాగా కలపండి.
  • కొద్దిగా పాలు వేసి మృదువైన పిండిని సిద్ధం చేయండి.
  • సుమారు 10 నుండి 15 నిమిషాలు పక్కన ఉంచండి.
  • ఆ తర్వాత చిన్న రౌండ్ జామున్ బంతులను తయారు చేయండి.

చక్కెర సిరప్ చేయడానికి.

  • ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల చక్కెర మరియు ఒక కప్పు నీరు కలపండి.
  • చక్కెర సిరప్‌లో ఏలకులు జోడించండి.
  • సిరఫ్ చిక్కగా ఏర్పడిన తర్వాత, చక్కెర సిరప్‌ను పక్కన ఉంచండి.
  • ఇంతలో, జామున్ వేయించడానికి పాన్ లో నూనె జోడించండి.
  • నూనె వేడెక్కిన తర్వాత, జామున్‌లను ఒక్కొక్కటిగా జోడించండి.
  • ఎర్రటి గోధుమ రంగులోకి వచ్చేవరకు వాటిని తక్కువ మంట మీద వేయించాలి.దీన్ని ప్లేట్‌కు మార్చండి.
  • తరువాత వాటిని షుగర్ సిరప్‌లో ఉంచండి.
  • జామూన్ మృదువుగా మారడానికి జామున్ సిరఫ్ లో కొద్ది సమయం అలాగే ఉంచండి.
  • ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, పొడి చక్కెర మరియు తురిమిన పొడి కొబ్బరికాయ కలపాలి.
  • షుగర్ సిరప్ నుండి జామున్ ను తీసివేసి కొబ్బరి మరియు షుగర్ సిరప్ మీద వేయండి.
  • దీన్ని సుమారు రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి.
  • పేర్కొన్న సమయం తరువాత, రుచికరమైన గులాబ్ జామున్ వడ్డించండి.

గణేష్ చతుర్థి కోసం డ్రై గులాబ్ జామున్ సిద్ధం చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.

English summary

Dry Gulab Jamun Recipe | How To Prepare Dry Gulab Jamun in Telugu

Read to know how to prepare dry gulab jamun recipe at home for ganesh chaturthi. This is an easy sweet recipe that can be prepared for festival.
Story first published:Thursday, August 20, 2020, 10:31 [IST]
Desktop Bottom Promotion