For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ : మ్యాంగో కేక్ రెసిపి ఎలా చేయాలో చూడండి...

By Lekhaka
|

ఈ ఆదివారం మదర్స్ డే వచ్చేసింది. అందరికీ ఇష్టమైన ఈరోజున మీ అమ్మ కోసం మీరేమైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయాలనీ అనుకుంటున్నారా? మీ అమ్మ డజర్ట్స్ ఇష్టపడతారా? అయితే, ఈ మ్యాంగో లేయర్ కేక్ మీ అమ్మ హృదయాన్ని కరిగిస్తుంది. మీరు వంటరిగా దీన్ని తయారుచేసారని తెలిసినపుడు ఆమె ఎంతో సంతోషిస్తుంది. మీ అమ్మతో కలిసి మీరు దీన్ని తయారుచేయవచ్చు, అమ్మ-కూతురు కలిసి కొంత సమయాన్ని గడిపినట్టు ఉంటుంది కూడా. గాసిప్స్ పంచుకోండి, మనస్పూర్తిగా నవ్వండి, ఆమె వంటలు నేర్చుకోండి, ఆ సమయం ఎంత అందంగా ఉంటుందో కదా.

వేసవి వారాంతాలు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారా? ఈరోజు, మ్యాంగో లేయర్ కేక్ అనే అద్భుతమైన వంటకం రుచిగా ఉండడమే కాకుండా, చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఈ క్రింది పదార్ధాలను అనుసరించి, ఇంట్లోనే ప్రయత్నించండి.

తయారీకి పట్టే సమయం – 20 నిముషాలు

వండడానికి పట్టే సమయం – 1 గంట


కేక్ కోసం కావాల్సిన పదార్ధాలు

1.గుడ్లు – 2

2.బేకింగ్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు

3.కేక్ పిండి – ¾ కప్పు

4.ఉప్పు – ½ టీస్పూను

5.పంచదార – 1 కప్పు

6.ఉప్పులేని బటర్ – 100 గ్రాములు

7.వెనిల్ల ఎసెన్స్ – 1 టేబుల్ స్పూన్

8.నిమ్మరసం – 1/8 టీ స్పూన్లు

9.పాలు – ½ కప్పు

క్రీమ్ కోసం

10.డబుల్ క్రీమ్ – 1 కప్పు

11.మ్యాంగో క్యూబ్స్ – 1 కప్పు

12.ఐసింగ్ షుగర్ – 2 టేబుల్ స్పూన్లు

13.వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీస్పూన్; మ్యాంగో కర్డ్ కోసం:

14.మ్యాంగో – 500 గ్రాములు (ముక్కలుగా తరిగినవి)

15.ఎగ్ యెక్ లు – 4

16.పంచదార – 1/3 కప్పు

17.ఉప్పు – చిటికెడు

18.నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు

19.ఆలివ్ ఆయిల్ – ¼ కప్పు

మీరు మ్యాంగో లేయర్ కేక్ తయారుచేయడానికి చాలా ఓపికగా ఉండాలి. దీనికి కొంచెం సమయం పడుతుంది. కానీ, ఒకసారి మీరు దీన్ని అలంకరిస్గ్తే, మీరు ఎన్ని ప్రశంసలు పొందుతారో చూడండి!

కేక్ తయారుచేసే విధానం

1.ఒక కేక్ పాన్ లేదా నాన్ స్టిక్ పాన్ తీసుకుని డానికి కింద, పక్కలు బటర్ పూయండి. అన్ని వైపులా పిండిని చల్లండి. ఓవెన్ ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ తో ప్రీ హీట్ చేయండి.

2.ఒక బౌల్ తీసుకుని, దాంట్లో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేయండి. మరోవైపు, ఒక బౌల్ లో బటర్, పంచదార, వేసి బ్లెన్డర్ తో మృదువుగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.

3.ఆసమయంలో ఎగ్ యెక్ ని కలిపి, ఇంకోటి కలిపే ముందు బాగా బీట్ చేయండి. బాగా కలిపి, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పాలు, నిమ్మరసం వేయండి. ఈ పదార్ధాలన్నీ కలిసేట్టు, మంచి నురగాలాంటి మిశ్రమం తయారయ్యేట్టు బీట్ చేయండి.

4.ఈ మిశ్రమాన్ని పిండి మిశ్రమంలో కలిపి బాగా కలపండి. అలాగే స్క్రాప్ చేయడం మర్చిపోకండి. ఈ మిశ్రమాన్ని కేక్ పాన్ లో వేసి రెడీగా ఉంచండి.

5.ప్రీ-హీట్ చేసిన ఓవెన్ లో ఈ కేక్ ని 20-25 నిమిషాల పాటు బెక్ చేయండి. కేక్ తయారయిందో లేదో తెలుసుకోడానికి టూత్ పిక్ తో పరీక్షించండి.

6.కేక్ పూర్తిగా చల్లపరచండి.

మ్యాంగో కర్డ్ కోసం

1.మామిడి ముక్కలు, ఉప్పు, నిమ్మరసం కలిపి బ్లెన్డర్ తో బాగా బ్లెండ్ చేయండి.

2.ఎగ్ యెక్ వేసి బాగా కలపండి. ఒక పెద్ద బౌల్ లో ఈ మిశ్రమాన్ని వడకట్టండి. బుడగలు పైకి రాకుండా నీటి బౌల్ పైన పెట్టండి. మిశ్రమం గట్టిపడే వరకు అపుడపుడు కలపండి.

3.సరైన కన్సిస్తేన్సీ వచ్చిన తరువాత, వేడి నుండి తీసి, ఆలివ్ ఆయిల్ కలపండి. దాన్ని కవర్ చేసి, రాత్రంతా రెఫ్రిజిరేటర్ లో ఉంచండి.

కేక్ ను సమీకరించడం

1.క్రీమ్ తయారుచేయడానికి, ఒక బౌల్ తీసుకుని, మ్యాంగో ముక్కలు కాకుండా మిగిలిన పదార్ధాలు తీసుకోండి.

2.కేక్ ను పొరలుగా కట్ చేయండి, ఒక లేయర్ ని సర్వింగ్ ప్లేట్ లో ఉంచండి. ఆలేయర్ మీద మ్యాంగో కర్డ్ వేసి, ఇంకో లేయర్ పెట్టి క్రీమ్ పూయండి.

3.దానిపై కత్తిరించిన మ్యాంగో ముక్కలు పెట్టి మరో లేయర్ తో కప్పి ఉంచండి. ఇలాగే చేస్తూ, చివరిగా కేక్ మొత్తాన్ని మ్యాంగో రాసి, క్రీమ్ ని స్ప్రెడ్ చేయండి.

4.ఫ్రిజ్ లో ఉంచి, చల్లగా సర్వ్ చేయండి. ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటుంది. కానీ మీ అబ్బాయి/అమ్మాయి పుట్టినరోజున దీన్ని సర్వ్ చేస్తే వారి మోహంలో చిరునవ్వు చూసి, మీరు అలసటను మర్చిపోతారు.

English summary

How to Prepare Mango Layer Cake

Mother’s Day is on next Sunday. Have you planned anything special to do for your mom on that day? Does your mother love desserts? Then, this recipe of mango layer cake will melt her heart. And when she will know that you have made it all alone, she will be the happiest. Also you can prepare this with your mom and spend some mother-daughter time together.