For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఘుమఘుమలాడే బెల్లం కేసరి: నవరాత్రి స్పెషల్

|

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.

నవరాత్రులు ఒక్కో రోజు.. ఒర్కో పేరుతో అమ్మవారిని కొలిచి చివరి రోజున చేసుకునే వేడుక విజయదశమి.. ఈ దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేస్తారు. ప్రాంతాలు వేరైనా.. వంటలు వేరైనా వాటిని భక్తితో దేవికి నైవేద్యంగా పెడతారు. అలాంటి నైవేద్యాలో కేసరి బాత్ ఒకటి. ఈ కేసరి బాత్ ను కాస్త వెరైటీగా బెల్లంతో తయారుచేస్తే ఎలా ఉంటుందో చూద్దాం...

Jaggery Kesari : Dasara Special

కావల్సినవి:
సన్న రవ్వ -1 cup
నెయ్యి / వెన్న: 3tsp
బెల్లం తురుము - 1cup
జీడిపప్పు, కిస్‌మిస్, బాదం పలుకులు - 1/2cup(అన్ని కలిపి)
యాలకులపొడి - ½tsp
కుంకుమ: 1 చిటికెడు(పసుపు లేదా ఎరుపు ఫుడ్ కలర్)
నీళ్లు - రెండుంబావు కప్పులు.

వంటలు పిండివంటలు - దసరా స్పెషల్...

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నింటిని రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేసి రవ్వను కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి. కలియబెడుతూ వేయించడం వల్ల రవ్వ బ్రౌన్ కలర్ కు మారకుండా ఉంటాయి.
3. ఇప్పుడు అదే పాన్ లో చాలా కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. అందులో బెల్లం తురుము వేసి మంట తగ్గించాలి. బెల్లం కరిగాక దింపేయాలి.
4. మరో పాన్ లో మిగిలిన నీళ్లు తీసుకుని స్టౌమీద మరగించాలి. నీరు మరుగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి, రవ్వ వేసి మంట తగ్గించేయాలి.
5. రవ్వ ఉడికాక బెల్లం కరిగించిన నీరు వేసి బాగా కలపాలి.
6. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతుంటే కాసేపటికి కేసరి దగ్గరకు వస్తుంది. అప్పుడు మిగిలిన నెయ్యీ, వేయించి పెట్టుకున్న జీడిపప్పూ, కిస్‌మిస్, బాదం పలుకులూ, యాలకులపొడీ వేసి కలపాలి.
7. రెండు నిమిషాల తరవాత దింపేయాలి. అంతే బెల్లం కేసరి బాత్ రెడీ. నవరాత్రి స్పెషల్ గా దుర్గా దేవికి నైవేద్యం, మనకు ప్రసాదం..

English summary

Jaggery Kesari : Dasara Special

Jaggery Kesari : Dasara Special,How to Prepare Bellam Kesari. Easy to cook and Traditional Recipes for Dussehra Festival. Here are some special festival recipes of navratri. You can prepare these tasty dishes easily in your homely kitchens...
Desktop Bottom Promotion