For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ స్పెషల్ రెసిపీ: మార్జిపాన్

క్రిస్మస్ స్పెషల్ రెసిపీ: మార్జిపాన్

|

క్రిస్మస్ కేకులు మరియు కుక్కీస్ తో చాలాచాలా ఎంజాయ్ చేసే సమయం. వివిధ రకాల కేకులు, కుకీలు, చాక్లెట్లు మరియు క్రిస్మస్ సీజన్లో మరెన్నో స్వీట్స్ తో ఎంజ్ చేయడానికి సంవత్సరంలో అత్యంత సంతోషకరమైన సమయం.

క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో తయారుచేసిన కుక్కీస్ ఎల్లప్పుడూ ప్రశంసించబడతాయి. దీనికి మీరు కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇది మీ అతిథులను కూడా నిజంగా ఆనందపరుస్తుంది.

Christmas Special Recipe: Marzipan

కాబట్టి, ఈ రోజు మీకోసం క్రిస్మస్ కోసం ఒక స్పెషల్ రెసిపీ ఉంది, ఇది తయారు చేయడం సులభం మరియు ఎక్కువసేపు నిల్వ చేయవచ్చు. మార్జిపాన్స్ బాదం మరియు చక్కెరతో తయారు చేసిన క్రిస్మస్ స్వీట్ మీట్స్. ఇది ఎక్కువ శ్రమ తీసుకోదు మరియు ఏ సమయంలోనైనా తయారుచేసుకోవచ్చు.

Christmas Special Recipe: Marzipan

క్రిస్మస్ స్పెషల్ రెసిపీ: మార్జిపాన్

మార్జిపాన్ తయారీ కోసం రెసిపీని చూడండి మరియు ఈ క్రిస్మస్ కోసం ఒకసారి ప్రయత్నించండి.

ఎంత మందికి సర్వ్ చేయవచ్చు: 5-6

తయారీ సమయం: 15 నిమిషాలు

Christmas Special Recipe: Marzipan

కావల్సినవి:

బాదం- 1 కప్పు

పొడి చక్కెర- 1 కప్పు

వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్ - 3 చుక్కలు

బాదం ఎక్స్ ట్రాక్ట్- 3 చుక్కలు

Christmas Special Recipe: Marzipan

క్రిస్మస్ స్పెషల్ రెసిపీ: మార్జిపాన్

తయారీ విధానం:

నీటిని మరిగించి బాదంపప్పు వేసి, 5 నిమిషాలు ఉడకబెట్టండి. అది చల్లబరచండి మరియు తరువాత పై పొట్టు తొలగించండి.

ఒక ఛాపర్లో బాదంపప్పు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

తరువాత పొడి చక్కెర వేసి పిండిలా కనిపించే వరకు మళ్ళీ ఛాపర్‌లో పేస్ట్ చేసుకోవాలి.

Christmas Special Recipe: Marzipan

వనిల్లా, బాదం ఎసెన్స్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి.

ఇప్పుడు ఒక ప్లేట్ మీద మూడు టేబుల్ స్పూన్ల చక్కెర పొడి చల్లండి మరియు బాదం మిక్స్ ను ఛాపర్ నుండి తీసివేసి చక్కెర మీద వేయండి. చక్కని ఉండగా చేసుకోవడానికి సరిగ్గా మెత్తగా పిండిని పిసికి కలుపుకోవాలి.

ఎయిర్ టైట్ బ్యాగ్‌లో ఉంచండి, అందులో గాలి చొరబడదని నిర్ధారించుకోండి మరియు ఫ్రిజ్‌లో ఉంచండి. కావలసిన ఆకారాలు మరియు పరిమాణాలలో ముక్కలను కత్తిరించండి.

Christmas Special Recipe: Marzipan

క్రిస్మస్ స్పెషల్ రెసిపీ: మార్జిపాన్

మీరు మార్జిపాన్లను 7 నెలల వరకు నిల్వ చేయవచ్చు, మీరు దానిని నిల్వ చేస్తున్న పెట్టెలోకి ఎటువంటి గాలిని అనుమతించవద్దు. మార్జిపాన్లను ఎయిర్ టైట్ బ్యాగ్స్ లేదా కంటైనర్లలో భద్రపరచడం మంచిది.

English summary

Marzipan Recipe for Christmas | How to Make Marzipan Sweets Recipe at Home

Christmas is the time to have lots and lots of sweets. Cakes, cookies, chocolates and so many more goodies of the Christmas season make it the most happy time of the year.
Desktop Bottom Promotion