For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్: కొబ్బరి బొబ్బట్టు

By Super Admin
|

నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కొక్క స్వీటు చేసి దుర్గా మాతకి నైవద్యం పెడతారు. ఖన్నుల పండుగగా ఉండే ఈ దసరా నవరాత్రుల కోసం అందరూ ఉంత్సాహంగా ఎదురు చూస్తారు. ఖొబ్బరి పూరన్ పోలీ లేదా కొబ్బరి బొబ్బట్ల తయారీ విధానమెలాగో ఈరోజు మీకు చెప్పబోతున్నాము.

ఈ బొబ్బట్ల తయారెకై కావాల్సినవి కొబ్బరి, మైదా, బెల్లం.నవరాత్రుల్లో ఉత్తర భారత దేశ ప్రజలు ఉపవాసం చేస్తారు. ఊపవాస సమయంలో తీసుకునే ఆహారంలో చాలా నియమాలుంటాయి. మైదా లేదా గోధుమ పిండిని కొంతమంది ఉపవాస సమయంలో తీసుకోరు. అలాంటి వారు ఈ బొబ్బట్ల తయారీలో బక్ వీట్ ఫ్లోర్(తెలుగులో కూటు అంటారు)ఉపయోగించవచ్చు.

ఇక ఈ బొబ్బట్టు తయారీ చూద్దామా..

ఎంత మందికి సరిపోతుంది-4

వండటానికి పట్టే సమయం-45 నిమిషాలు

సామాగ్రి సమకూర్చుకోవడానికి-30 నిమిషాలు.

కావాల్సిన పదార్ధాలు.

  • మైదా-ఒక కప్పు
  • పసుపు-1/4 టీ స్పూను
  • నీళ్ళు-ఒక కప్పు
  • కొబ్బరి నూనె-ఒక టీ స్పూను
  • బెల్లం-ఒక కప్పు
  • తాజా తురిమిన కొబ్బరి-ఒక కప్పు
  • దంచిన ఏలకులు-కొన్ని
  • నెయ్యి మరియూ ఉప్పు.

తయారీ విధానం:

1. ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, ఉప్పు,పసుపు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ కలపాలి.

పిండి కలిపాకా దానిలో కొబ్బరి నూనె వేసి మరికాస్త కలపాలి.ఈ కలిపిన పిండిని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

Navratri Special: Coconut Puran Poli

2. తాజా కొబ్బరిని తురుముకోవాలి లేదా మిక్సీ ఉపయోగిస్తున్నట్లయితే నీళ్ళు పొయ్యకుండా తురుములాగ చేసుకోవాలి.

Navratri Special: Coconut Puran Poli

3. ఒక గిన్నెలో నీళ్ళూ తీసుకుని బెల్లం వేసి కరిగేంతవరకూ స్టవ్ మీద పెట్టాలి.

Navratri Special: Coconut Puran Poli

4. మలినాలుంటే తొలగించడానికి కరిగిన బెల్లం మిశ్రమాన్ని వడకట్టాలి.

వడకట్టిన మిశ్రమంలో తురిమిన తాజా కొబ్బరి, దంచి పెట్టుకున్న ఏలకులు వెయ్యాలి.

Navratri Special: Coconut Puran Poli

5. కొబ్బరి కలిపిన బెల్లాన్ని మరలా పొయ్యి మీద పెట్టి తేమ పోయి దగ్గర పడేంతవరకూ ఉడికించుకోని చల్లారనివ్వాలి.

Navratri Special: Coconut Puran Poli

6. కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ప్యాటీ లాగ చేసి దానిలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి ఉబ్బెత్తుగా లేకుండా మెల్లిగ తట్టాలి.ఇలాగే మిగిలిన పిండితో కూడా చేసుకోవాలి.

Navratri Special: Coconut Puran Poli

7. ఇప్పుడు చపాతీ వత్తుకునే పీట మీద కొంచం పిండి వేసి ఫిల్లింగ్ చేసి పెట్టుకున్న ప్యాటీలని కాస్త మందంగా బొబ్బట్ల లాగ వత్తుకోవాలి.

Navratri Special: Coconut Puran Poli

8. పెనం మీద నెయ్యి వేసి వత్తుకున్న బొబ్బట్టుని దోరగా కాల్చుకోవాలి. కాల్చిన బొబ్బట్ల మీద నెయ్యి వేసి సర్వ్ చెయ్యడమే.

Navratri Special: Coconut Puran Poli
Navratri Special: Coconut Puran Poli

English summary

Navratri Special: Coconut Puran Poli

Navratri is that time of the year when most of the sweet recipes are prepared and offered to the goddess.It is the most colourful and joyous festival that people can't wait to celebrate. On these nine days, each day a special sweet recipe is prepared and offered to each Goddess for Navratri.
Desktop Bottom Promotion