For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ : సొరకాయ హల్వా రిసిపి

|

దేవీ నవరాత్రులు ఆల్రెడీ మొదలయ్యాయి. దేవీ నవరాత్రులు..ఈ తొమ్మిది రోజులూ, ఇండియాలో ఒక్కో రోజును ఒక్కో విధంగా పూజిస్తారు. ఈ పండుగ సందర్భంలో తొమ్మిది రోజూలు అత్యంత పవిత్రంగా ఉపవాసదీక్షలు చేయడం ఆచారం. ఈ సమయంలో ఉపవాసాలుండే వారు ఒక కఠినమైన నిబంధనలను అనుసరిస్తారు. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు చేస్తారు. అలాగే కొంత మంది అల్పాహారాలను తీసుకొనేవారూ ఉన్నారు.

అల్పాహరం అంటే రెగ్యులర్ గా తయారు చేసేవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా తయారు చేసే వంటలు కూడా ఉన్నాయి. అందులో సొరకాయ హల్వా, స్వీట్ రిసిపి కూడా ఒకటి. సొరకాయతో తయారుచేసే వంటలను ఉపవాసం ఉన్నవారు తీసుకోవచ్చు. మరి అటువంటి వారికోసం ఇక్కడ ఒక స్పెషల్ స్వీట్ ను ఎలా తయారుచేయాలో ఇవ్వడం జరిగింది. దీన్ని తయారుచేసి ఉపవాసం ఉన్నవారు లేని వారు కూడా ఈ స్వీట్ తిని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ నవరాత్రి స్పెషల్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

Navratri Spl: Lauki Ka Halwa Recipe

కావల్సిన పదార్థాలు :
సొరకాయ తురుము: 3cups
నెయ్యి: 3tbsp
వేడి పాలు: 3cups
యాలకుల పొడి: 1/2tsp
పంచదార పొడి: 3/4cup
బాదం: 7(ముక్కలుగా కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా సొరకాయకు పై పొట్టు తొలగించి తర్వాత తురిమి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, వేడయ్యాక అందులో సొరకాయ తురుము వేయాలి.
3. సన్నని మంట మీద వేగిస్తున్నప్పుడు సొరకాయ నుండి నీరు ఇమిరిపోయే వరకూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులో పాలు పోసి, బాగా మిక్స్ చేయాలి. పది నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
5. తర్వాత అందులోనే యాలకుల పొడి వేసి మిక్స్ చేయాలి. పదినిముషాల తర్వాత హల్వా డ్రై అవుతూ చిక్కబడే సమయంలో పంచదార పొడిని జోడించాలి.
6. తర్వాత బాగా మిక్స్ చేసి, 5 నిముషాల తర్వాత తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
7. చివరిగా బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే సొరకాయ హల్వా రెడీ. దీన్ని చల్లారిన తర్వాత సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది . ఇది నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండే వారికి ఒక ఫర్ ఫెక్ట్ రిసిపి.

English summary

Navratri Spl: Lauki Ka Halwa Recipe

Navratri is a time when your diet is severely restricted. If you follow the rules set by Hinduism, there are several things that you cannot add to Navratri recipes. Nine days without onions, garlic, flour or rice becomes difficult to sustain. However, you are not prohibited from eating sweets. So thank the Goddess for small pleasures in life and have delicious lauki ka halwa during Navratri.
Desktop Bottom Promotion