For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓనమ్ స్పెషల్: అడ పాయసం: కేరళ స్వీట్ రిసిపి

|

ఓనమ్ పండుగ. కేరళయులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని పండుగ. ఈ పండుగకు చాలా స్పెషల్ స్వీట్ ను తయారుచేసి, కుంటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులతో పంచుకొని, సంతోషంగా గడుపుతారు.

ఈ సంవత్సరం ఓనమ్ ఆగష్టు 28(శుక్రవారం)వచ్చింది. మరి ఈ ఓనమ్ స్పెషల్ గా, కేరళ స్వీట్ రిసిపి మీకోసం పరిచయం చేస్తున్నాము. ఈ ఓనమ్ పండుగకు స్వీట్ డిష్ లేకుండా పండగ సంపూర్ణం కాదు. కాబట్టి ఓనమ్ సందర్భంగా ఒక స్పెషల్ రిసిపి అడపాయసం. ఇది తయారుచేయడం చాలా సులభం, చాలా సాధారణ పదార్థాలతోనే తయారుచేస్తారు. కమ్మటి రుచి ఉండే అడపాయసం ఎలా తయారుచేయాలోచద్దాం....

Onam Special: Delicious Ada Payasam

కావల్సిన పదార్థాలు:

అడ(రైస్ల్ ప్లాక్స్ లేదా రైస్ చిప్స్): 1packet (వీటిని బియ్యంతో తయారుచేస్తారు)
పాలు: 2ltrs
జీడిపప్పు: 8-10
ద్రాక్ష: 8-10
నెయ్యి: 1cup
కుంకుమపువ్వు: చిటికెడు
పంచదార: 1cup

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరిగించాలి. తర్వాత అందులో 100-150గ్రాముల అడ వేసి పక్కన పెట్టుకోవాలి.
2. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక మందపాటి లోతైన గిన్నె తీసుకొని అందులో పాలు పోసి ఖాచాలి.
4. పాలు బాగా కాగిన తర్వాత, వేడినీటిలో నానబెట్టుకొన్న అడను వడగట్టుకు పాలలో వేయాలి .
5. వేసిన తర్వాత మద్యమధ్యలో కలియబెడుతుండాలి. లేదంటే అడుగు భాగం మాడుతుంది మరియు ఉండలు కడుతుంది.
6. ఇప్పుడు అందులో పంచదార వేసి కంటిన్యూగ పంచదార కరిగే వరకూ కలియబెడుతుండాలి.ః
7. ఇప్పుడు ఒక చిన్న కప్పులో ఒక టేబుల్ స్పూన్ పాలు మరియు చిటికెడు కుంకుమపువ్వు వేసి మిక్స్ కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి.
8. పాయసం చిక్కబడుతున్నప్పుడు అందులో కుంకుమపువ్వు మరియు పాలు వేయాలి.
9. పాన్ లో, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో జీడిపప్పు, ద్రాక్ష వేసి ఫ్రై చేసుకోవాలి.
10. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు మరియు ద్రాక్షను అడ పాయసంలో వేసి మిక్స్ చేయాలి.చివరగా కొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేయాలి. అంతే ఓనమ్ స్పెషల్ అడ పాయసం రెడీ.

English summary

Onam Special: Delicious Ada Payasam

Onam is one of the most celebrated festival in Kerala. People in Kerala wait to celebrate onam with lot of joy and happiness. This year onam falls on 28th August. As we are just a week away from onam, we shall teach you the best recipes that is prepared for onam.
Story first published: Friday, August 21, 2015, 14:57 [IST]
Desktop Bottom Promotion