For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజ్‌భోగ్ స్వీట్: దీపావళి స్పెషల్

|

భారతీయు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది.

మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతున్నది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో..ఇంటినిండా బందువులు, స్నేహితులతో చాలా ఆడంభరంగా జరుపుకొనే దీపావళి. హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు. అటువంటి స్వీట్ డిష్ లో బెంగాలీ స్పెషల్ స్వీట్ రాజ్ భోగ్ దీన్ని తయారుచేయడం చాలా సులభం అంతే కాదు, నోట్లో పెట్టుకుంటే అలాగే కరిగిపోవాల్సిందే అంతసాఫ్ట్ గా మరియు అద్భుతమైన రుచితో కలర్ఫుల్ గా నోరూరిస్తుంటుంది. మరి ఈ స్పెషల్ రాజ్ భోగ్ స్వీట్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Rajbhog Sweets: Diwali Special

కావల్సిన పదార్థాలు:
పాలవిరుగు - 250 గ్రా. (ఆవు పాల నుంచి చేసినది);
పచ్చికోవా - 3 టేబుల్ స్పూన్లు;
పిస్తాపప్పులు - 15;
మైదా - టీ స్పూను;
పంచదార - 5 కప్పులు;
కుంకుమపువ్వు - అర టీ స్పూను;
రోజ్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు;
ఏలకుల పొడి - అర టీ స్పూను.

తయారుచేయు విధానం:
1. ముందుగా పాలవిరుగును మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
2. తర్వాత వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి.
4. తర్వాత పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో పిస్తా, బాదం మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన ఉంచాలి.
5. ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి
6. తయారుచేసి ఉంచుకున్న స్టఫ్‌డ్ బాల్స్‌ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి.
7. అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదునిముషాలు ఉంచితే, బాల్స్ రెట్టింపు సైజుకి పొంగుతాయి. అంతే రాజ్ భోగ్ స్వీట్ రిసిపి రెడీ.

Story first published: Saturday, October 11, 2014, 16:38 [IST]
Desktop Bottom Promotion