For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రవ్వ పాయసం: వరలక్ష్మీ వ్రత స్పెషల్

శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు.

|

శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.

దేశంలోని అన్ని ప్రాంతాలలో విశేష సందర్భాలలో, సంతోష సమయంలో, పండగలు, పూజలప్పుడు స్వీట్లు చేయడం తప్పనిసరి..పాయసం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతీయ సాంప్రధాయంలో ఏ కార్యానికైనా ముందు తీపి రుచి అందిస్తారు. వాటిలో పాయసం కూడా ఒక్కటి ముఖ్యంగా పండుగలు వచ్చాయంటే చాలు అందరిళ్ళలోనూ పాయసం ఘుమఘుమలే.

READ MORE:తంబిట్టు : వర మహాలక్ష్మీ వ్రత స్పెషల్ డిష్

పాయసంను వివిధ రకాలుగా వండుతుంటారు. పండుగలు అనగానే ముందు గుర్తొచ్చేది పాయసమే.ఎన్నో వెరైటీల పాయసాలు ఉన్నారవ్వ, బెల్లం, సోంపుతో తయారుచేసే చేసే ఈ పాయసం చాలా ట్రెడిషనల్. ముఖ్యంగా రవ్వతో చేసే పాయసం చాలా టేస్ట్ గా ఉంటుంది. మరి రవ్వ పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం...

Rava Payasam Recipe

కావల్సిన పదార్థాలు
సన్న రవ్వ: 1cup
నీళ్ళు: 2cups
పాలు: 3 cups
నెయ్యి: 2tbsp
జీడిపప్పు, ద్రాక్ష మరియు బాదం : 1/2cup(అన్ని కలిపి)
పంచదార: 2cups

READ MORE: కోవా కోకనట్ బర్ఫీ: శ్రావణ మాసం స్వీట్స్

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో ర3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి.
2. తర్వాత అందులో రవ్వ వేసి వేయించుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
3. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అదే పాన్ లో వేసి వేడి చేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, బాదం మరిు కిస్ మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో సరిపడా నీళ్ళు పోసి, నీరు మరిగేటప్పుడు రవ్వ వేయాలి. రవ్వ ఉడుకుతున్న సమయంలో అందులో పాలు పోసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఉడికించుకోవాలి.
5. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత అందులో మిగిలిన నెయ్యి, కిస్ మిస్, బాదం పలుకులు, జీడిపప్పు మరియు పంచదార వేసి బాగా కలుపుకోవాలి.
6. పాయసంలో ఉన్న పంచదార పూర్తిగా కరిగిన తర్వాత దింపుకోవాలి. అంతే రవ్వ పాయసం రెడీ.

English summary

Rava Payasam Recipe -Varalakshmi Vratham Special

Traditional South Asian sweet dessert, prepared for all special occasions. It is also prepared and offered to gods as prasad. Payasam is also known as Kheer in Hindi. It used to be prepared during all the temple festivities and special occasions. The most common sweet dish prepared in every home and liked by the kids too.
Desktop Bottom Promotion