For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దివాళీ స్పెషల్ సక్కరే పరే స్వీట్ రిసిపి

By Staff
|

సక్కర పరె, తెలుగులో కళకళాలు అంటారు. ఇది ఒక స్వీట్ రిసిపి, దీపావళి సందర్బంగా ఈ స్వీట్ రిసిపిని పరిచయం చేస్తున్నాము.

దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండుగ, దేశ మొతంలో కాదు, ప్రపంచ మొత్తంలో ఈ పండుగను జరుపుకుంటారు. దీపావాళి అంటేనే గెటుగెదర్. బందువులు, స్నేహితులు అందరూ కలుసుకోవడం, స్వీట్స్ తినిపించుకోవడం, బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆ పండుగ యొక్క ప్రత్యేకత. ఇల్లంతా దీపాలు,లైట్స్, క్రాకర్స్ తో అందంగా కళకళలాడు ముస్తాబవుతుంది. ఇటువంటి సంతోషకరమైన వాతావరణంలో కాజుకట్లీ, లడ్డూలు, వంటివి మీరు మిస్చేసుకోలేరు?

దీపావళి స్సెషల్ గా మీ జీవితాల్లో తియ్యదనాన్ని నిపండానికి ఈ రోజు మీకోసం ఒక స్సెషల్ స్వీట్ రిసిపిని పరిచయం చేస్తున్నాము,ఇది చాలా టేస్టీ, స్వీట్ రిసిపి. దీన్ని దీపావళి మరింత స్వీట్ గా సెలబ్రెట్ చేసుకోవడానికి తయారుచేసుకోవచ్చు. అయితే ఈ స్వీట్ రిసిపి తయారుచేయాడానికి ఏమేమి అవసరమౌతాయి, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. దీపావళీ స్పెషల్ గా ఇంటిల్లిపాదిని సంతోష వాతావరణంలో నింపేద్దాం...

Shakkar Pare Sweet Recipe For Diwali

సర్వ్స్ - 4

ప్రిపరేషన్ సమయం - 30నిముషాలు

కుకింగ్ సమయం - 50 నిముషాలు

కావల్సినవి:

సక్కర పరే కు కావల్సినవి

1. గోధుమ పిండి - 2కప్పులు

2. నెయ్యి - 2టేబుల్ స్పూన్లు

3. నీళ్ళు కలుపుకోవడానికి తగినంత

4. సేమియా - ¼th కప్పు

5. డీప్ ప్రై చేయడానికి నూనె తగినంత

షుగర్ సిరఫ్ కోసం

1. పంచదార పౌడర్ - 1 కప్పు

2. నీళ్లు - ½కప్పు

3. కుంకుమపువ్వు - కొద్దిగా (అవసరమైతే)

తయారీ:

1. ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి తీసుకోవాలి, అందులో సేమియా, నెయ్యి, పంచదార పొడి వేసి బాగా అన్ని కలిసేలా కలపాలి.

2.ఇప్పుడు పిండి తడుపుకోవడానికి సరిపడా నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి. పిండిని సాప్ట్ గా కలిపి పక్కన పెట్టుకోవాలి.

3. పిండిని రెండు సమభాగాలుగా చేసి , క్లీన్ గా ఉండే కాటన్ క్లాత్ లో చుట్టు పెట్టాలి.

4. అరగంట, గంట తర్వాత, పిండి బయటకు తీసి, మందగా పరాటా లాగా ఒత్తుకోవాలి. లేదా రోల్ చేయాలి.

5. ఇప్పుడు , పరాఠాను నిలువుగా, అడ్డంగా డైమండ్ షేప్ పీసులుగా కట్ చేసుకోవాలి.

6. ఇప్పుడు కొద్దిగా నూనెను పాన్ లో వేసి హీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఒత్తుకుని, డైమండ్ షేప్ లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

7. ఆ తర్వాత స్టౌమీ డీప్ బాటమ్ పాన్ పెట్టి, నూనె వేడిచేయాలి. నూనె వేడి అయిన తర్వాత మంటను మీడియంగా పెట్టి, కట్ చేసి పెట్టుకున్నడైమండ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.

8. కొద్దికొద్దిగా మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకే సారి వేసకుంటే, ఒకదానికొకటి అంటుకునేస్తాయి. విడివిడిగా ఫ్రై చేసుకోవాలి.

9. గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి కిచెన్ టవల్ లేదా పేపర్ టవల్ మీద వేసి పెట్టాలి.

షుగర్ సిరఫ్ కోసం

1. షుగర్ లేదా షుగర్ పౌడర్ ను పాన్ లో తీసుకుని, సరిపడా నీళ్లు పోయాలి.

2. ఇప్పుడు మంటను తక్కువ మంట పెట్టి, పంచదార పూర్తిగా వాటర్ తో కలిసి,కరిగే వరకూ ఉంచాలి.

3. మద్యమద్యలో కలుపూ షుగర్ సిరఫ్ బబుల్స్ గా, చిక్కగా మారే వరకూఉంచాలి. తర్వాత సిరఫ్ లో కొద్దిగా కుంకుమ పువ్వును మిక్స్ చేయాలి..

4. షుగర్ సిరఫ్ చిక్కబడే వరకూ కలియబెడుతూ ఉడికించి , స్టౌ ఆఫ్ చేయాలి.

5. ఫైనల్ గా షుగర్ సిరఫ్ ను ముందుగా తయారుచేసి పెట్టుకున్న డైమండ్ కలకలా మీద పోసి, మొత్తం కవర్ అయ్యేలా చేసి చల్లారనివ్వాలి. అంతే సక్కర్ పెరే రెడీ.

English summary

Shakkar Pare Sweet Recipe For Diwali

Diwali is fast approaching us and the preparation for it is almost beginning. Diwali is the occasion to get together with the family members, have a party, check on the amazing lights, crackers and obviously, gorge on sweets. You can't imagine Diwali without kaju katlis or ladoos, can you?
Desktop Bottom Promotion