Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తమిళనాడులో బండ్ల మీద చేసే ఉల్లిపాయ చట్నీ..టిఫిన్స్ లోకి పర్ఫెక్ట్ సెట్
ఈసారి మీరు ఇంట్లో ఇడ్లీ లేదా దోశ వేసుకున్నప్పుడు రొటీన్ గా చేసుకునే పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ కాకుండా తమిళనాడులో బండ్ల మీద దొరికే స్పెషల్ ఉల్లిపాయ చట్నీని తప్పకుండా ప్రయత్నించండి. ఇది కాస్త కారంగా, పుల్లగా, తీపిగా ఉంటూ నోరూరించే రుచిని కలిగి ఉంటుంది.
తమిళనాడు స్టైల్ ఉల్లిపాయ చట్నీ అనేది కేవలం నాలుకకు రుచినిచ్చే పదార్థం మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణ ఆరోగ్యకరమైన సైడ్ డిష్. ఇందులో వాడే ప్రతి దినుసులోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. వేడి వేడి ఇడ్లీపై నెయ్యి వేసుకుని ఈ చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. దీని తయారీలో వాడే ప్రతి దినుసులోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. తమిళనాడు స్టైల్ ఉల్లిపాయ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయలు
-ఎండు మిరపకాయలు
-బెల్లం
-చింతపండు
-రాళ్ల ఉప్పు
-నూనె
-ఆవాలు
-మినపప్పు
-కరివేపాకు
-ఇంగువ
తయారీ విధానం
-ముందుగా 10 ఎండు మిరపకాయలను అరగంట సేపు నీటిలో నానబెట్టాలి. తమిళనాడులో ఈ చట్నీ కోసం దేగి మిర్చి(degi mirch)అనే వెరైటీనే వాడతారు. ఇది కారం తక్కువ, రంగు,ఘాటుతో ఉంటుంది.
-తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన ఎండు మిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, గోలీ సైజు చింతపండు, నిమ్మకాయ సైజు అంత బెల్లం, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టీస్పూన్ల నూనె వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో అర టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించిన తర్వాత 1 టీస్పూన్ మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడేవరకు ఫ్రై చేసుకోండి.
-ఇప్పుడు బాండీలో మెుత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి మీడియం మంట మీద 3 నిమిషాలు కలుపుతూ ఉంటే నూనె పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆపేయండి.
-అంతే తమిళనాడు స్టైల్ ఉల్లిపాయ చట్నీ రెడీ. ఈ పచ్చి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇదే పచ్చడిని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో తీరులో చేస్తుంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications