Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు
వేసవికాలం వచ్చేసిందంటే చాలు మనం రకరకాల కూల్ డ్రింక్స్ వైపు పరుగులు తీస్తున్నాం కానీ మన అమ్మమ్మలు, నానమ్మల కాలంలో వేసవి వేడిని జయించడానికి ఎన్నో అద్భుతమైన, సహజసిద్ధమైన వంటకాలు ఉండేవి. అందులో ముఖ్యమైనది, ఆంధ్రుల ఇళ్లల్లో అత్యంత ప్రీతిపాత్రమైనది తరవాని చారు. దీన్నే గంజి రసం అని కూడా అంటారు.
ఈ చారును అప్పటికప్పుడు వంచిన తాజా గంజితో కాకుండా, ఒక రాత్రి లేదా రెండు రోజుల పాటు నిల్వ చేసిన గంజితో చేస్తారు. పాత రోజుల్లో అన్నం వడకట్టిన తర్వాత మిగిలే గంజిని పారబోయకుండా, ఒక మట్టి కుండలో లేదా పాత్రలో పోసి మూతపెట్టేవారు. గాలిలోని సహజ బ్యాక్టీరియా చేరి అది పులిసేలా చేస్తుంది. ఇలా పులిసిన గంజిలో ఉండే పుల్లదనమే ఈ చారుకు అసలైన రుచిని తీసుకొస్తుంది.

పుల్లటి గంజి అంటే ఈనాటి భాషలో చెప్పాలంటే అదొక న్యాచురల్ ప్రోబయోటిక్. ఇది మన పేగుల ఆరోగ్యాన్ని (గట్ హెల్త్) అద్భుతంగా మెరుగుపరుస్తుంది. మండు వేసవిలో శరీరంలోని వేడిని లాగేసి, తక్షణ చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది కాబట్టి అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. తేలికగా అరుగుతుంది కనుక చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరైనా నిశ్చింతగా తీసుకోవచ్చు.
తరవాని చారు తయారీకి కావాల్సిన పదార్థాలు
-గంజి
-ఆవాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-కరివేపాకు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయలు
-కారం
-మిరియాల పొడి
-కొత్తిమీర
-టమాటో
తరవాని చారు తయారీ విధానం
-ముందుగా నిల్వ ఉంచిన పుల్లటి గంజిని సిద్ధం చేసుకోవాలి.
-ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.
-తాలింపు వేగుతుండగానే అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. నచ్చితే చిన్న టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పుల్లటి గంజిని అందులో పోసి తగినంత ఉప్పు, కొద్దిగా కారం లేదా మిరియాల పొడి చల్లాలి. సన్నని మంటపై ఓ ఐదు నిమిషాలు మరగనివ్వాలి.
-దించే ముందు గుప్పెడు కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే తరవాని చారు రెడీ.
-కొందరు ఈ చారులో కొద్దిగా మజ్జిగ కలుపుకుని అన్నంతో తింటారు. ఇంకొందరు వెల్లుల్లి ఎక్కువగా వేసి ఘాటుగా చేసుకుంటారు. దీన్ని అన్నంలోనే కాకుండా, చల్లని సమ్మర్ డ్రింక్ లాగా గ్లాసులో పోసుకుని తాగేయొచ్చు. పుల్లటి గంజి పైన తేరిన నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే ఒంట్లో వేడి చిటికెలో మాయమవుతుంది.
-అయితే గంజి మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండి, దుర్వాసన వస్తే మాత్రం దాన్ని వాడకూడదు. ఎండాకాలంలో అయితే ఒక రోజు బయట ఉంచి పులిశాక ఫ్రిజ్‌లో పెట్టుకోవడం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications