Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చపాతీ, దోసె,అన్నంలోకి.. దేనిలోకైనా అదిరిపోయే టమాటా తొక్కు ఎలా చేసుకోవాలంటే..
రోజూ ఇంట్లో చేసుకునే చపాతీ, పూరీ, దోసె వంటి టిఫిన్లలోకి ఎప్పుడూ ఒకే రకమైన చట్నీలు, గ్రేవీలు తిని బోర్ కొడుతోందా? అన్నంలోకి కలుపుకోవడానికి కమ్మని పచ్చడి ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తోందా? అయితే టమాటా తొక్కు ట్రై చేయండి. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, చాలా తక్కువ సమయంలో ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
పుల్లపుల్లగా, కారంగా ఉండే టమాటా తొక్కు.. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా, లేదా చపాతీ, పూరీల్లోకి నంజుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. నోరూరించే టమాటా తొక్కును ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాగా పండిన టమాటాలు: 10 పెద్దవి
చింతపండు:నిమ్మకాయ సైజు
ఎండు మిరపకాయలు: 15
వెల్లుల్లి రెబ్బలు: 13
మెంతులు: అర టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
ఆవాలు: 1 టీస్పూన్
మిరియాలు: 10
నూనె: సరిపడా
ఇంగువ: చిటికెడు
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని, అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక మెంతులు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపి, వాటిని చల్లారనివ్వాలి.
-వేయించిన దినుసులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అదే జార్ లో కడిగి శుభ్రం చేసుకున్న టమాటా ముక్కలు, నానబెట్టిన చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. టమాటాల్లోని నీరు సరిపోతుంది కాబట్టి ప్రత్యేకంగా నీరు పోయాల్సిన అవసరం లేదు.
-ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే బాండీ పెట్టి, కొంచెం ఎక్కువ నూనె పోయాలి. నూనె బాగా కాగాక ఆవాలు, ఇంగువ, తాజా కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
-తాలింపు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటను చిన్నగా లేదా మీడియంలో ఉంచి బాండీపై మూత పెట్టాలి.
-ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మిశ్రమం దగ్గర పడి, పచ్చడి నుండి నూనె వేరుపడి పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలితే పచ్చడి తయారైనట్లే. రంగు కూడా ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం దీనిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications