Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు..ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ తో పర్ఫెక్ట్ గా!
సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది రకరకాల పిండివంటలు. అందులోనూ బూందీ లడ్డుకు ఉండే ప్రత్యేకతే వేరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడే మిఠాయి ఇది. సంక్రాంతి పండుగ సమయంలో బంధుమిత్రులకు స్వాగతం పలకడానికి, దేవుడికి నైవేద్యం పెట్టడానికి బూందీ లడ్డు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
శనగపిండి, చక్కెరకు నెయ్యిని జోడించి చేసే బూందీ లడ్డు ఈ చలికాలంలో శరీరానికి తగిన శక్తిని ఇవ్వడమే కాకుండా, నోటిలో వేసుకోగానే కరిగిపోయే అద్భుతమైన రుచిని అందిస్తుంది. సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డును ఇంట్లోనే సులభంగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-శనగపిండి
-పంచదార
-నీళ్లు
-నెయ్యి
-యాలకుల పొడి
-జీడిపప్పు, కిస్మిస్
-పచ్చ కర్పూరం
-నూనె
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు(500గ్రా) శనగపిండి, చిటికెడు వంటసోడా, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తం కలిసేలా ఉండలు లేకుండా బజ్జీల పిండి కంటే కాస్త పలుచగా ఉండేలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి బాగా వేడి చేశాక అందులో గ్లాసుతో లేదా గిన్నెతో కలిపిన పిండిని తీసుకొని దానిని బూందీ గరిటలో వేసుకొని చేతిలో కదుపుతూ ఆయిల్ లో వేయాలి.
-బాండీలో వేసిన బూందీ ఎక్కువగా వేగకూడదు, పైన లైట్ గా క్రిస్పీగా ఉండాలి,లోపల మెత్తగా వచ్చేంతవరకు పెద్ద మంట మీదనే వేయించుకోవాలి. దీనికి 1 నిమిషం సమయం పడుతుంది. తర్వాత దీనిని బయటకు తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో బూందీ మెత్తాన్ని రెడీ చేసుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో కొంచెం బూందీని వేసి లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో అరకప్పు జీడిపప్పు వేసి లైట్ గా కలర్ మారిన తర్వాత అందులో పావు కప్పు ఎండు ద్రాక్ష వేసి బాగా వేయించుకొని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి అందులో 2 కప్పుల చక్కెర(1 కేజీ), 1 కప్పు నీళ్లు పోసి పెద్ద మంట మీద పాకం వచ్చేదాకా ఉంచాలి. లైట్ తీగపాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి గిన్నెను పక్కన పెట్టుకోండి.
-తర్వాత రెడీ చేసుకున్న పాకంలో 1 టీస్పూన్ యాలకల పొడి, రెడీ చేసుకున్న బూందీ, గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండుద్రాక్ష, కొద్దిగా పచ్చ కర్పూరం నలిపి వేసి మెత్తం కలిసేలా గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి.
-కలుపుకున్న తర్వాత గిన్నె మీద మూతపెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. దీంతో బూందీ చక్కెర సిరప్ ని పీల్చుకుంటుంది.
-లైట్ గా గోరువెచ్చగా ఉన్న సమయంలో మీకు నచ్చిన సైజులో లడ్డుల్లా చేసుకోండి. అంతే సూపర్ టేస్టీ సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications