Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
స్నాక్ గానే కాదు,అన్నంలోకి కూడా అదుర్స్..ఒక్కసారి తింటే వదిలిపెట్టని కాలీఫ్లవర్ వడలు
సాధారణంగా కూరగాయల్లో కాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం. మార్కెట్ నుండి కాలీఫ్లవర్ తేగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గోబీ మంచూరియా, గోబీ 65 లేదా రొటీన్ కూర. ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి కొత్తగా కాలీఫ్లవర్ వడ ట్రై చేయండి.
ఇది కేవలం స్నాక్ మాత్రమే కాదు చపాతీలు లేదా అన్నంలోకి సైడ్ డిష్ గా కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కాలీఫ్లవర్ కూర తినడానికి మారాం చేసే పిల్లలు కూడా ఈ వడలు చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. చేయడం చాలా సులభం, రుచిలో మాత్రం అమోఘం.ఈ వడల రుచిని పెంచడానికి మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులే సరిపోతాయి. కాలీఫ్లవర్ వడలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్: 1
శనగపిండి - అర కప్పు
అల్లం పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
సోంపు - 1 టీస్పూన్
గసగసాలు - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
పచ్చిమిర్చి - 4
కొత్తిమీర-కొద్దిగా
పుదీనా-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
జీడిపప్పు - 10
పసుపు - 1 టీస్పూన్
ఉప్పు-సరిపడా
నూనె- వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా కాలీఫ్లవర్ ను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-స్టవ్ మీద ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి మరిగించండి. అందులో కాస్త పసుపు, ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలను వేయండి. వీటిని పూర్తిగా ఉడికించకూడదు కేవలం 7-8 నిమిషాలు (సగం ఉడికేలా) ఉంచి నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.
-ఉడికించిన కాలీఫ్లవర్ ను చాలా సన్నని ముక్కలుగా కోసుకోవాలి లేదా తురుముకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఈ కాలీఫ్లవర్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం పేస్ట్, సోంపు, గసగసాలు, సన్నగా తరిగిన జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. చివరగా శనగపిండి వేసి చేత్తో బాగా కలపండి. అవసరమైతేనే ఒక స్పూన్ నీళ్లు చల్లుకుని వడల పిండిలా గట్టిగా కలుపుకోండి.
-చేతులకు కాస్త నూనె రాసుకుని పిండిని చిన్న ఉండలుగా తీసుకుని, అరచేతిలో పెట్టి వడల్లా వత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా సమానంగా వత్తుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతాయి.
-స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేశాక మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి వడలను వేయండి. వడలు వేసిన వెంటనే గరిటెతో తిప్పకండి, అవి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఒక వైపు బాగా కాలాక, నెమ్మదిగా రెండో వైపుకు తిప్పండి.
-రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు 2-3 నిమిషాలు వేయించి తీసేయండి. టిష్యూ పేపర్ మీద వేస్తే అదనపు నూనె పీల్చుకుంటుంది.
-అంతే ఘమఘమలాడే వేడి వేడి కాలీఫ్లవర్ వడలు రెడీ. వీటిని టమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తింటుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications