Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Sarva pindi: తెలంగాణ స్పెషల్ 'సర్వ పిండి'..తింటే ఉంటదిరా చారి..10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు
తెలంగాణలో స్పెషల్ గా చేసే సర్వపిండికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏ వయస్సు వారైనా సరే వీటిని తినేందుకు ఇష్టపడతారు. ఒక్కసారి ఒక్కముక్క నోట్లో పెట్టుకుంటే నాలుక మళ్లీ మళ్లీ కావాలని అడుగుతుంటది. అంత రుచికరంగా ఉంటుంది. చలికాలంలో చేసుకొని వేడి వేడిగా తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కామన్ మ్యాన్ పిజ్జాగా పిలువబడే సర్వపిండిని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ. తెలంగాణ ప్రసిద్ధ వంటకం సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్ధాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం పిండి
-నువ్వులు
-వేయించిన వేరుశెనగ పప్పు
-నానబెట్టిన శెనగపప్పు
-సన్నగా తరిగిన ఉల్లిపాయ
-తరిగిన పచ్చిమిర్చి
-కరివేపాకు
-కారం
-ఉప్పు
-నూనె
-కొత్తిమీర
-జీలకర్ర
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఆయిల్

సర్వ పిండి తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం పిండి వేసి అందులోనే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి,చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ,సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన రెండు రెమ్మల కరివేపాకు,1 టేబుల్ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ జీలకర్ర,వేయించిన పొట్టు తీసుకున్న ఒకటిన్నర టేబుల్ స్పూన్ పల్లీలు, నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల పచ్చి శెనగపప్పు,సరిపడా కారం,రుచికి సరిపడా ఉప్పు,అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి.
-కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం లూజ్ గా ఉండేలా కలిపి ఈ బౌల్ ని పక్కనపెట్టుకోండి. ఉప్పు,కారం చెక్ చేసుకోని సరిపోకపోతే కొంచెం వేసుకోండి
-ఇప్పుడు అడుగు మందంగా ఉండే గుంటలాంటి బాండీ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి బాండీ అంతా ఆయిల్ అంటుకునేలా చేతితో స్ప్రెడ్ చేయండి.
-ఇప్పుడు బౌల్ లో కలిపిపెట్టుకున్న పిండిని కొంచెం ముద్దగా తీసుకొని దాన్నీ ఆయిల్ పూసిన బాండీలో వేసి మరీ పల్చగా కాకుండా,మరీ మందంగా కాకుండా మీడియంగా బాగా వత్తుకొని మధ్య మధ్యలో రంధ్రాలు మాదిరి చేయండి.
-ఇప్పుడు ఆ హోల్స్ లో కొంచెం ఆయిల్ పోసి బాండీని స్టవ్ మీద పెట్టుకోండి. బాండీపై మూత పెట్టేసి మంటను సిమ్ లో పెట్టి వేయించుకోవాలి.
-10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. సర్వపిండి బాండీ నుంచి విడిపోయినట్లు అయితే దాన్ని గరిటతో మరో వైపుకి తిప్పు లైట్ గా వేపుకోండి. టేస్టీ సర్వపిండి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications