Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
కమ్మటి సువాసనతో మతులు పోయేలా..అయ్యంగార్ స్టైల్ ప్రసాదం పులిహోర ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులోని అయ్యంగార్ బ్రాహ్మణ సంప్రదాయంలో పులిహోర అనేది కేవలం వంటకం కాదు, అది ఒక పవిత్రమైన నైవేద్యం. ఆలయాలలో లేదా ఇంట్లో చేసే పూజలలో ప్రసాదంగా దీనిని సమర్పించడం ఆనవాయితీ. సాధారణంగా చేసే పులిహోర కంటే అయ్యంగార్ స్టైల్ పులిహోర కాస్త భిన్నంగా, ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలతో, ఎక్కువ చింతపండు పులుపుతో తయారుచేయబడుతుంది. ఈ ప్రత్యేకత వల్లే దీనిని ఆలయ పులిహోర లేదా ప్రసాదం పులిహోర అని కూడా అంటారు. అయ్యంగార్ స్టైల్ లో మీ ఇంట్లోనే ప్రసాదం పులిహోరను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-చింతపండు
-సోనామసూరి రైస్
-ఉప్పు
-పసుపు
-జీడిపప్పు
-పల్లీలు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-ఆయిల్
-ఇంగువ
-జీలకర్ర
-ధనియాలు
-ఆవాలు
-కరివేపాకు
-మిరియాలు
-మెంతులు
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు

తయారీ విధానం
-ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి.ఇందుకోసం ఓ గిన్నెలో 80-100 గ్రాము చింతపండు వేసి అందులో 1 కప్పు మరుగుతున్న నీళ్లను పోసి నానబెట్టుకోవాలి.
-తర్వాత కుక్కర్ లో 2 గ్లాసుల(500గ్రా)సోనామసూరి రైస్ వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత 3 గ్లాసుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ ఆయిల్ వేసి మూతపెట్టి మీడియం మంట మీద 2 విజిల్స్ రానివ్వాలి.
-బియ్యం ఉడికేలోగా పులిహోర పొడి తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ ఆవాలు, 2 టీస్పూన్ల జీలకర్ర, 2 టీస్పూన్ల మిరియాలు, 2 టీస్పూన్ల మెంతులు, 4 టీస్పూన్ల ధనియాలు, అర టీస్పూన్ ఆయిల్ వేసి తక్కువ మంట మీద దినుసులన్నింటిని లైట్ గా దోరగా వేయించాలి. దినుసులు కాస్త వేగాకా అందులో రెండు రెమ్మల కరివేపాకు,4 ఎండుమిరపకాయలు వేసి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వేయించినవన్నీ మిక్సీ జార్ లో వేసి అందులోనే చిటికెడు ఇంగువ, పావు టీస్పూన్ పసుపు కూడా వేసి వీటన్నింటిని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు పులిహోరకి తాళింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె లేదా పల్లీ నూనె వేసి వేడి చేశాక అందులో పావు కప్పు పల్లీలు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లోని ఆయిల్ లో 1 టీస్పూన్ ఆవాలు, 2 టీస్పూన్ల 1 టేబుల్ స్పూన్ పచ్చి శెగనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి తక్కువ మంట మీద వీటన్నింటిని దోరగా వేయించుకున్నాక అందులో 4 ఎండుమిరపకాయలను తుంపి వేయండి, కొంచెం కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. దించేముందు పావు టీస్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి.

-తర్వాత పొడి పొడిగా పలుకు పలుకుగా ఉడికిన అన్నాన్ని గరిటతో కలిపి డ్రైగా అయిపోకుండా పైన మూతపెట్టి ఉంచండి.
-తర్వాత చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. ఇందుకోసం నానబెట్టిన చింతపండులో నుంచి గుజ్జును వడకట్టి తీసుకొని అందులో 2-3 టీస్పూన్ల ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఆయిల్, 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి.
-ఇప్పుడు చింతపండు గుజ్జు ఉన్న పాన్ ని స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద చిక్కగా ఉడికించాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని,వేయించి పక్కన పెట్టుకున్న తాళింపుని కూడా ఇందులో వేసి బాగా కలిపి 2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-తర్వాత ఒక పెద్ద డీసులోకి ఉడికించిన రైస్ వేసి ఇందులో కొంచెం ఆయిల్, కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి చేత్తో బాగా కలుపుకున్నాక చింతపండు మిశ్రమం మొత్తాన్ని వేసి అన్నం ప్రి పలుకుకి కలిసేలా చేత్తో బాగా కలుపుకున్నాక వేయించిన పల్లీలు కూడా వేసేస్తే ప్రసాదం పులిహోర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications