Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ధాబా స్టైల్ స్మోకీ ఫ్లేవర్ తో..అద్భుతమైన చికెన్ భర్తా మీ ఇంట్లోనే ఈజీగా..రుచి చూస్తే ఫిదా
చికెన్ లేనిదే ముద్ద దిగదా? రోజూ అవే చికెన్ వెరైటీలు తిని తిని బోర్ కొట్టేసి కొత్తగా ఏదైనా చికెన్ రెసిపి తినాలనిపిస్తుందా? అయితే ఒక ప్రత్యేకమైన రుచితో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉండే చికెన్ భర్తా ట్రై చేయాల్సిందే. ఇది ముఖ్యంగా బెంగాలీ, ధాబా స్టైల్ వంటకాల నుండి ప్రసిద్ధి చెందింది.
సాధారణ చికెన్ కూరలకు దీనికి ప్రధానమైన తేడా చికెన్ ను ఉపయోగించే విధానంలోనే ఉంది. సాధారణ కూరలలో చికెన్ ముక్కలను నేరుగా వండుతాం. కానీ చికెన్ భర్తా కోసం ముందుగా చికెన్ ను మసాలా దినుసులతో ఉడికించి, ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పీచులుగా విడదీస్తారు.. తర్వాత చికెన్ ను ఉల్లిపాయ, టమాటో, ఇతర మసాలాలతో చేసిన గ్రేవీలో కలిపి వండుతారు.

చికెన్ భర్తా తయారీకి కావాల్సిసన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ - 500 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
నీళ్లు - సరిపడా
నూనె లేదా నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి - 2
టమాటాలు - 3
పసుపు - అర టీస్పూన్
కారం - 1-2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
పెరుగు -అర కప్పు
జీడిపప్పు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేథీ - 1 టీస్పూన్
బొగ్గు - చిన్న ముక్క
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉడికించిన గుడ్లు - 2

చికెన్ భర్తా తయారీ విధానం
ముందుగా బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడగాలి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ లో లేదా గిన్నె పెట్టి అందులో చికెన్, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. కుక్కర్ లో అయితే 3-4 విజిల్స్ సరిపోతాయి.
చికెన్ ఉడికిన తర్వాత నీటిని (చికెన్ స్టాక్) వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ స్టాక్ ను తర్వాత గ్రేవీలో వాడవచ్చు.
ఉడికించిన చికెన్ చల్లారిన తర్వాత చేతితో చిన్న చిన్న పీచులుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతైన పాన్ లో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
ఇప్పుడు టమాటో ప్యూరీ వేసి నూనె పైకి తేలేంతవరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.తర్వాత మంటను తగ్గించి, గిలకొట్టిన పెరుగును మెల్లగా వేస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం నుండి నూనె పైకి తేలడం ప్రారంభించినప్పుడు, గ్రేవీ సరిగ్గా ఉడికినట్లు.
ఇప్పుడు మనం ముందుగా పీచులుగా చేసి పెట్టుకున్న చికెన్ ను స్టవ్ మీద ఉన్న గ్రేవీలో వేసి బాగా కలపాలి. పక్కన పెట్టుకున్న చికెన్ స్టాక్ ను కొద్దిగా పోసి, గ్రేవీ చిక్కదనాన్ని సర్దుబాటు చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి 5-7 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. దీనివల్ల మసాలాలన్నీ చికెన్ కు బాగా పడతాయి.
ఇప్పుడు గరం మసాలా, నలిపిన కసూరి మేథీ, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ వంటకానికే హైలెట్ అయిన పొగ పెట్టడం (ధంగర్ పద్ధతి)కోసం ఒక చిన్న బొగ్గు ముక్కను నిప్పుల మీద ఎర్రగా కాలే వరకు వేడి చేయాలి.
ఇప్పుడు చికెన్ భర్తా మధ్యలో ఒక చిన్న స్టీల్ గిన్నెను ఉంచి అందులో వేడి బొగ్గును పెట్టాలి. దానిపై ఒక టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేయగానే పొగ వస్తుంది. వెంటనే పాన్ పై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఆ పొగను కూరలోకి ఇంకేలా చేయాలి. ఈ పద్ధతి వల్ల కూరకు అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.
5 నిమిషాల తర్వాత బొగ్గు గిన్నెను తీసివేయాలి. కూరను బాగా కలిపి పైన కొత్తిమీర, ఉడికించిన గుడ్డు ముక్కలతో గార్నిష్ చేయండి. అంతే చికెన్ భర్తా రెసిపి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications