Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
జొన్నలు, బీరకాయతో అదిరిపోయే హెల్దీ బ్రేక్ ఫాస్ట్..జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కే పనుండదు!..ఎలా చేసుకోవాలంటే.
ఒకప్పుడు మన పూర్వీకులు వైట్ రైస్ కి బదులుగా జొన్నలను ఎక్కువగా తమ ఆహారంలో భాగంగా తీసుకునేటోళ్లు. అందులో వాళ్లు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా బలంగా ఉండేటోళ్లు అంటారు. గోధుమలు, బియ్యంతో పోలిస్తే జొన్నల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో అందరిలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి మన పూర్వీకులు తిన్న జొన్నలను ఇప్పుడు మళ్లీ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. 1 కప్పు జొన్నలు, బీరకాయతో సూపర్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్నలు
-టమాటో
-బీరకాయ
-కందిపప్పు
-ఎర్ర కందిపప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
-మిరపకాయ
-జీలకర్ర
-మిరియాలు
-ఆవాలు
-ఇంగువ
-అల్లం
-కారం
-పసుపు
-ఉప్పు
-పెసరపప్పు
-నెయ్యి
తయారీ విధానం
-1 గిన్నె పచ్చ జొన్నలను శుభ్రంగా కడిగాక అవి మునిగివరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత రోజు ఉదయం ఓ గిన్నెలో గుప్పెడు కందిపప్పు, గుప్పెడు పెసరపప్పు, గుప్పెడు ఎర్ర కందిపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి 1 గంటసేపు నానబెట్టాలి.
-తర్వాత ముప్పావు కేజీ బీరకాయలను తీసుకొని వాటి పీచును తొలగించి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు నానబెట్టిన జొన్నల్లోని నీరు వంపేసి జొన్నలను మిక్పీ గిన్నెలో వేసి కొంచెం బరకగా నూకల్లా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత అందులో 1స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాల మిశ్రమం, 1స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, చిటికెడు ఇంగువ, 3 పచ్చిమిరపకాయల చిన్న ముక్కలు, 2రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి.
-తర్వాత అందులోనే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, 2 టమాటోల ముక్కలు వేసి 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ కారం, అరస్పూన్ పసుపు వేసి కలిపి 1 నిమిషం పాటు వేయించాక జొన్నలను తీసుకున్న గిన్నెతోనే 10 గిన్నెల నీళ్లను ఇందులో పోసి కలపాలి. మీడియం మంట మీద నీళ్లు బాగా మరగనివ్వాలి.
-నీళ్లు మరగడం ప్రారంభమయ్యాక గ్రైండ్ చేసిన జొన్నల పొడిని, నానబెట్టిన పప్పులను వేసి కలిపి ఉడకనివ్వాలి.
-ఉడకడం స్టార్ట్ అయ్యాక కుక్కర్ మీద మూతపెట్టి తక్కువ మంట మీద 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
-తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు చల్లుకుంటే జొన్న బ్రేక్ ఫాస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









