Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఇంట్లో కూరగాయలు లేవా? 15 నిమిషాల్లో నోరూరించే రాజస్తానీ మసాలా పాపడ్ కర్రీ
రాజస్తాన్ వంటకాలలో ఒక ప్రత్యేకమైన, సులభమైన, అత్యంత రుచికరమైన వంటకమే మసాలా పాపడ్ కర్రీ. కేవలం 15 నిమిషాలలోనే తయారు చేసుకోగలిగే మసాలా పాపడ్ కర్రీ..రోటీ, చపాతీ, లేదా అన్నంతో తిన్నా అమోఘంగా ఉంటుంది. మసాలా పాపడ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
మినప లేదా పెసర పప్పు పాపడ్- 5
పెరుగు - 1 కప్పు ( 200 గ్రాములు)
ఉల్లిపాయ - 1
టమాటో - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చి మిర్చి - 2
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
ఇంగువ- చిటికెడు
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్ (మీ రుచికి తగినట్టు)
ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
శెనగపిండి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్ళు - ఒకటిన్నర కప్పులు
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
ముందుగా పాపడ్లను సిద్ధం చేసుకోవాలి. పాపడ్ ను
మంట మీద రెండు వైపులా సమానంగా కాలే వరకు అవి కరకరలాడుతూ వచ్చే వరకు
కాల్చాలి. చల్లారిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా విరిచి పక్కన
పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకుని, ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ధనియాల పొడి, శెనగపిండి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక లోతైన పాన్ స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ వేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి.
ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమాటో ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
టమాటోలు బాగా మగ్గిన తర్వాత మంటను సిమ్ లో పెట్టి ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని నెమ్మదిగా పాన్ లో వేయాలి. వేసిన వెంటనే గరిటెతో ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించాలి.
ఇప్పుడు ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. గ్రేవీలో మొదటి ఉడుకు వచ్చే వరకు మీడియం మంట మీద ఉడికించాలి.
గ్రేవీ ఉడకడం ప్రారంభించాక మంటను తగ్గించి, పాన్ పై మూత పెట్టి 5-7 నిమిషాల పాటు ఉడికించాలి. గ్రేవీ కొద్దిగా చిక్కబడి, నూనె పైకి తేలుతుంది. చివరగా గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి.
ఇప్పుడు విరిచి పెట్టుకున్న పాపడ్ ముక్కలను వేడి గ్రేవీలో వేసి నెమ్మదిగా కలపాలి. ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి. అంతే మసాలా పాపడ్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
