Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆరోగ్యానికి సంజీవని,రుచిలో అమోఘం..మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలంటే..
తెలుగు వారి భోజనంలో పప్పుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందులోనూ ఆకుకూరలు, కూరగాయలు కలిపి చేసే పప్పులు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన కలయికే మునగాకు మామిడికాయ పప్పు. మునగాకును ఆయుర్వేదంలో సంజీవనిగా భావిస్తారు. దానికి పుల్లని మామిడికాయను జతచేసి పప్పు వండితే ఆ రుచి అమోఘం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పప్పు కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది. ఈ పప్పు కేవలం కడుపు నింపడానికే కాదు, శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇందులో వాడిన ప్రతి పదార్థం ఒక ఔషధమే.

మునగాకు మామిడికాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు
కందిపప్పు - 1 కప్పు
మునగాకు - 2 కప్పులు
పచ్చి మామిడికాయ - 1
ఉల్లిపాయ - 1 )
పచ్చిమిర్చి - 4 లేదా 5
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు (పోపు కోసం)
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండుమిర్చి - 2 లేదా 3
వెల్లుల్లి రెబ్బలు - 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - చిటికెడు
మునగాకు మామిడికాయ పప్పు తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా రెండు సార్లు నీటిలో కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-మునగాకును కాడలు లేకుండా వొలుచుకుని, ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముదురు కాడలు ఉంటే పప్పు చేదు వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఆకులు మాత్రమే తీసుకోవాలి.
-పచ్చి మామిడికాయను చెక్కుతీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానబెట్టిన కందిపప్పు వేయాలి. ఒక చెంచా నూనె వేసి సరిపడా నీళ్లు పోయాలి. కుక్కర్ మూతపెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి పప్పును గరిటెతో మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె లేదా బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. జీలకర్ర, ఆవాలు, ఇంగువ,పచ్చిమిరపకాయలను నేరుగానే అందులో వేసి వేయించాక అందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసి రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించాలి. ఆకు పచ్చివాసన పోయి కాస్త మగ్గిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు, పసుపు,ఉప్పు,కారం వేసి బాగా కలిపిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి.
-మునగాకు మామిడిముక్కలు ఉడికిన తర్వాత మూత తీసి గరిటతో వాటిని మెత్తగా మెదపుకున్నట్లు చేయండి. తర్వాత ఇందులో ఉడికించి ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల మామిడికాయ పులుపు, మునగాకు రుచి పప్పుకు బాగా పడతాయి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మునగాకు మామిడికాయ పప్పు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications