Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అబ్బా వద్దు అనే ఉప్మా కాదు! టేస్ట్ అదిరిపోయే పాతకాలం నాటి ఉప్మా రొట్టె..ఎలా చేసుకోవాలో చూడండి
ఉప్మా పేరు చెప్పగానే చాలామందికి అబ్బా వద్దు వద్దు అనే మాటే నోటి నుంచి వస్తుంటది. అయితే ఉప్మా రొట్టె అనే పేరు వింటే మాత్రం వావ్ అంటారు. పాతకాలంలో ఎక్కవుగా ఉప్మా రొట్టెను తయారుచేసేవాళ్లు. దీని రుచి ముందు ఏదైనా దిగదుడుపే. దీనిని తయారుచేస్తుంటే ఆ ఘుమఘుమలకు పక్కింటోళ్లు కూడా మాకు పెట్టండి అని ప్లేట్ లు పట్టుకురావడం ఖాయం. ఉప్మా రొట్టె తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చిటికెలో దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఉప్మా అంటే మొఖం చాటేసే పిల్లలు, పెద్దలు ఒక్కసారి ఉప్మా రొట్టె టేస్ట్ చేస్తే రోజూ ఇదే కావాలని అడగడం ఖాయం. పాతకాలం నాటి ఉప్మా రొట్టెను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉప్మా రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఇంగువ
-ఆయిల్
-1 గ్లాసు బియ్యం రవ్వ(నూక)
-8 ఎండుమిరపకాయలు
-4 పచ్చిమిరపకాయలు
-చిన్న కప్పు పచ్చి శెనగపప్పు
-చిన్న కప్పు పచ్చి బఠాణీలు
-చిన్న కప్పు పెసరపప్పు
-చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము
-2 రెమ్మల కరివేపాకు

ఉప్మా రొట్టె తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్(రొట్టె కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది)వేసి ఇందులో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చి శెనగపప్పు, పెసరపప్పు వేసి కొంచెం సేపు వేయించాక పచ్చిమిరపకాయలు వేసి ఇవి కొంచెం వేగాక పచ్చి బఠాణీలు,కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఈ తాళింపును బాగా వేయించాలి.
-తాళింపు వేగిన తర్వాత అందులో కొబ్బరి తురుము వేసి బాగా కలిపేసి తర్వాత ఇందులోనే 2 గ్లాసుల నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి నీళ్లను మరగనివ్వాలి.
-నీళ్లు బాగా మరిగి తెర్లకాగుతున్నప్పుడు అందులో బియ్యం రవ్వ(నూక)ను కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరగా అయ్యేదాకా మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
-తర్వాత ఈ ఉప్మాని ఓ హస్తంతో నీటుగా పరిచినట్లుగా సర్దుకోవాలి(దోశ పోసినట్లు ఉండేలా). మూతపెట్టి పావు గంట సేపు అలా ఉంచితే రొట్టె మంచిగా కాలుతుంది.
-ఇప్పుడు మూత తీస్తే రొట్టె చివర్లలో బాగా ఎర్రగా కనబడితే మంచిగా కాలినట్లు అర్థం. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. అంటే టేస్టీ ఉప్మా రొట్టె రెడీ. కొంచెం చల్లారాకా దీన్ని ప్లేట్ లోకి తీసుకొని తింటుంటే నోట్లో బ్లాస్ట్ అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications