Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
వందల రోగాలు రాకుండా చేసే అద్భుతమైన పచ్చడి..తాలింపు కూడా అక్కర్లేదు,ఎలా చేసుకోవాలంటే..
పచ్చడి అనే పేరు వింటేనే చాలామందికి నోట్లో నీళ్లూరుపోతుంటాయి. వేడి వేడి అన్నంతో పచ్చడి వేసి నెయ్యితో కలిపి తింటుంటే ఆహా నోటికి స్వర్గమే అని పచ్చళ్ల ప్రేమికులు తరచూ చెబుతుంటారు. అదే పచ్చడిని మనదేశపు సూపర్ ఫుడ్ తో చేస్తే..రుచితో పాటు ఆరోగ్యం కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. మునగాకుని మనదేశపు సూపర్ ఫుడ్ గా చెబుతారు.
మనగచెట్టుల్లోని ప్రతి ఒక్కటి కాయ నుంచి బెరడు, ఆకు వరకు అన్నీ మన ఆరోగ్యానికి బోలెడు మేలు చేసేవే. మునగాకుతో చేసే పచ్చడికి వందల రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది. పిల్లల్లో కంటిచూపు బాగా పెరగడానికి,షుగర్ కంట్రోల్ లో ఉండటానికి, క్యాన్సర్ లాంటి రోగాలను రాకుండా చేయడంలో సాయపడే మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మునగాకు
-చింతపండు
-ఎండుమిరపకాయలు
-వేరుశెనగపప్పు
-ఆయిల్
-ఉప్పు
-జీలకర్ర
-ధనియాలు
-వెల్లుల్లి
-ఉల్లిపాయ
తయారీ విధానం
-ముందుగా 2 కప్పుల లేత మునగాకుని శుభ్రంగా కడిగాక తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.
-తర్వాత నిమ్మకాయంత సైజు చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక గుప్పెడు వేరుశెనగపప్పు వేసి తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి.
-వేరుశెనగపప్పు సగం వరకు వేగాక ఇందులో 10 ఎండుమిరపకాయల ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర వేసి వీటిల్లోని పచ్చిదనం పోయేదాకా తక్కువమంట మీద వేయించి తర్వాత ఈ మొత్తాన్ని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో మరో 2 స్పూన్ల నూనె వేసి వేడి చేసి ఇందులో శుభ్రం చేసుకున్న మునగాకు వేసి తక్కువ మంట మీద 10 నిమిషాలు వేగించుకోవాలి. మునగాకు బాగా వేగితేనే పచ్చడి తినేటప్పుడు వగరుగా లేకుండా మంచి రుచిగా ఉంటుంది.
-వేయించిన మునగాకుని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోనే నానబెట్టిన చింతపండుని నీటితో సహా వేసి తక్కువ మంట మీద 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన పల్లీలు ఎండుమిర్చి మిశ్రమం వేసి,ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన పౌడర్ లోనే వేయించిన మునగాకు, 6 వెల్లుల్లి రెబ్బలు, ఉడికించిన చింతపండుని నీళ్లతో సహా వేసి కొంచెం బరకగా ఉండేలా మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. దీనివల్ల రోట్లో వేసి పచ్చడి దంచుకుంటే ఎలా ఉంటుందో అలాగ వస్తుంది.
-బరకగా గ్రైండ్ చేసిన పచ్చడిలో కొన్ని పచ్చి ఉల్లిపాయ పెద్ద ముక్కలు వేసి బాగా కలిపితే మునగాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడికి తాలింపు లేదా పోపు వేయనక్కర్లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications